రేపే చివరి కార్తీక సోమవారం.. ఇలా చేయండి
జ్యోతిష్యం ప్రకారం కొన్ని పనులు మనం చేయకపోయినా.. చెడు జరుగుతూ ఉంటాయి. పూర్వ జన్మలో చేసిన తప్పుల వల్ల లేదంటే ఇతర కారణాలేమైనా ఉండొచ్చు. ఏ పని తలపెట్టిన అడ్డంకులు ఏర్పడుతుంటే కాలసర్ప దోషం ఉందని పండితులు చెబుతుంటారు. అలాంటివారు. రేపు కార్తీక సోమవారం చివరి రోజున ఇలా చేస్తే దోషం నుంచి విముక్తి లభిస్తుందని తెలియజేస్తున్నారు.
కార్తీక మాసం శివ కేశవులకు ప్రీతికరమైనది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి ఈ ఏడాది సోమవారం నాడు వచ్చింది. దీంతో ఈ సంవత్సరాన్ని ఏడాదిని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అలాగే ఈ ఏడాది చివరి సోమవారం కూడా ఎంతో విశేషమైందని పండితులు చెబుతున్నారు. శివుడిని ఆరాధించడంతోపాటు రుద్రాభిషేకం చేయడంవల్ల ఎంతో మంచి ఫలితం ఉంటుందంటున్నారు. శివుడిని ఆరాధిస్తూనే నాగదేవతకు ప్రత్యేక పూజలు చేయాలని సూచిస్తున్నారు. వీలైతే కొన్ని వెండి ఆభరణాలు ధరించడంవల్ల కూడా ఉపయోగాలున్నాయంటున్నారు.

కాలసర్పదోషం పోవాలంటే శ్రీకాళహస్తి లేదంటే నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లో కాలసర్పదోషం పూజలు చేయించుకోవాలని చెబుతారు. ఈ ఆలయాలకు వెళ్లలేని వారు మహా మృత్యుంజయ మంత్రం, శ్రీ విష్ణు పంచాక్షరి మంత్రాలను పఠించాలి. సర్పదోషం ఉన్న వారు ఏ పని తలపెట్టినా అడ్డంకులు ఎదురవుతుంటాయి. అంతేకాదు.. దరిద్రం తాండవిస్తుంటుంది. ఆర్థికంగా కుంగిపోతారు. అలాంటి వారు కార్తీక చివరి సోమవారం రోజు శివుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలను పొందుతారని, దోషం కూడా తొలగిపోతుందని పండితులు తెలిపారు.












Click it and Unblock the Notifications