102 ఏళ్ల తర్వాత అరుదైన పారిజాత యోగం.. ఈ రాశులపై కనక వర్షం
ఖగోళంలో నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. రాశి చక్ర గుర్తులకు బాగా కలిసివచ్చే యోగాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో పారిజాత యోగం, నారాయణ యోగం, గజకేసరి యోగాలు చాలా ముఖ్యమైనవి. వీటివల్ల వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుంది.
శ్రీ మహా విష్ణువుకు ఏకాదశి అంటే చాలా ఇష్టం. అత్యంత ప్రీతికరం. దాదాపు 102 సంవత్సరాల తర్వాత జ్యేష్ఠ మాసంలో ఏకాదశి రోజు పారిజాత యోగం ఏర్పడింది. అలంకార ప్రియుడైన విష్ణువును పూజించుకుంటే ఎన్ని ఆటంకాలున్నా అవి తొలగిపోతాయి. వాస్తవానికి మనకు ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఆరోజు చేసే దానాలు, పుణ్య కార్యక్రమాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. పారిజాత యోగం వల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారు భూమిని కొనుగోలు చేస్తారు. కొత్తగా వాహనాన్ని కొంటారు. ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూమికి సంబంధించి, ఆస్తికి సంబంధించి అన్నదమ్ములతో ఏర్పడిన వివాదాలన్నీ ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.
సింహరాశి
ఈ రాశివారి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ మంచి కలిగించేవే. భార్యవైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది. అలాగే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను ఈ సమయంలోనే స్వీకరిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. అలాటే లాటరీ తగిలితే అదృష్టం ఎలా కలిసివస్తుందో అలాంటిదే మీ జీవితంలో చోటుచేసుకోబోతోంది.












Click it and Unblock the Notifications