రాఖీ పౌర్ణమి నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఈ నెల 9వ తేదీన వచ్చింది. అన్నా చెల్లెళ్ల ప్రేమకు, ఆప్యాయతకు ప్రతిరూపం ఈ పండగ. ప్రతి ఏడాది దేశం మొత్తం ఎంతో ఘనంగా ఈ పండగను జరుపుకుంటారు. అదే రోజు భద్రడి నీడ కూడా ఉండబోతోందని పండితులు తెలియజేస్తున్నారు. రాఖీ పండగకు సంబంధించిన శుభ సమయం కూడా ఆ రోజ కేవలం ఏడు గంటలే ఉంటోంది. రాఖీ రోజే కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. బుధుడు, రాహువు, శని తిరోగమనంలో పయనిస్తాయి. ఇది చాలా అరుదుగా సంభవించే పరిణామం. దీనివల్ల ఏయే రాశులవారి జీవితాల్లో మార్పులు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
రాఖీ నుంచి వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది.ఆరోజు పెట్టుబడులు పెట్టడంవల్ల మంచి లాభాలను అందుకుంటారు. ఎటువంటి సమస్యలకైనా అప్పటి నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక చింతలన్నీ తొలగిపోతాయి. బాధ్యలు పెరుగుతాయి. పెట్టుబడుల తర్వాత ఈ రాశివారు అపారమైన సంపదను పొందుతారు. చిరకాల కోరికలన్నీ నెరవేరతాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు.

మీనరాశి
ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా కలిసివస్తుంది. ఆర్థికంగా ఉన్న సంక్షోభాలన్నీ తొలగిపోతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి పనినైనా చాలా సులువుగా పూర్తిచేయగలుగుతారు. ఆరోజు నుంచి వ్యాపారం ప్రారంభిస్తే అద్భుతంగా కలిసివస్తుంది. సోదరుల సహాయంతో కొన్ని ప్రయోజనాలను పొందుతారు. వాటి నుంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్థులకు కూడా ఇదే స్థాయిలో కలిసి వస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరడానికి కూడా ఇది చాలా మంచి సమయం.
జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు
గ్రహాలు తిరోగమనంలో ఉండటంతో మిథున రాశి, మేష రాశి, కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తా ఉండాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. బుధుడిని, రాహువును, శనిని, గురువును పూజించాలి. లేదంటే వ్యాపారస్తులకు భారీ నష్టాలుంటాయి. సమస్యలన్నీ చుట్టుముడతాయి. ప్రత్యర్థులు ఎక్కువవుతారు. మానసికంగా ప్రశాంతతను కోల్పోతారు.












Click it and Unblock the Notifications