64 ఏళ్ల తర్వాత ఈ రాశులకు అఖండ సంపద
ఏడాదిలోని అన్ని మాసాల్లో పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసం తర్వాత విష్ణువుకు జ్యేష్టమాసం అంటే అత్యంత ప్రీతికరమని పండితులు తెలియజేస్తున్నారు. శ్రీ మహా విష్ణువును ఈ మాసంలో ఆరాధిస్తే కుటుంబంలో అనేక శుభకార్యాలు జరుగుతాయి. ఈ నెల 11వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది. ఆరోజు విష్ణు సహస్ర నామ పారాయణం, లలితా సహస్ర నామ పారాయణం, సత్యనారాయణ వ్రతం కథలు చదువుకోవాలి.
కోరుకున్న కోరికలు నెరవేర్చడంతోపాటు కోరని కోరికలను కూడా ఆ వైకుంఠనాథుడు నెరవేరుస్తాడు. 64 సంవత్సరాల తర్వాత సూర్యుడు, కుజుడు సింహరాశిలో కలుసుకోబోతున్నారు. అలాగే పౌర్ణమి రోజే సరస్వతి అమ్మవారు మూల నక్షత్రంలో ఉంటారు. దీనివల్ల రెండు రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి వివరాలను, వారికి ఎలా కలిసివస్తుందనే విషయాలను తెలుసుకుందాం.

కన్యారాశి
ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. వివాహమైనవారికి సంతాన యోగం ఉంది. ఈ రాశివారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. మీకు తగిన కుటుంబంతో వివాహం నిశ్చయమవుతుంది. అనుకోకుండా ధనలాభం వస్తుంది. అలాగే పదిమందికి సాయం చేసే స్థితికి చేరుకుంటారు. దీంతోపాటు ఎదుటివారితో మాట్లాడే సమయంలో వివాదాలు జరగడానికి అవకాశం ఉంది. బయట సాధ్యమైనంతవరకు తక్కువగా మాట్లాడుతూ మౌనంగా ఉండటానికే ప్రాధాన్యత ఇవ్వాలి.
వృషభరాశి
న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టుల నుంచి తీర్పు అనుకూలంగా వస్తుంది. ఆస్తులు మీపరం అవుతాయి. తల్లిదండ్రుల వైపు నుంచి, భార్య వైపు నుంచి ఆస్తులు వస్తాయి. అనుకోనిరీతిలో ఒకరకంగా లాటరీ తగిలినట్లే అనుకోవచ్చు. కొత్తగా ఇంటితోపాటు భూమిని కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. వచ్చిన డబ్బును పొదుపు చేయడంతోపాటు భవిష్యత్తులో రాబడి వచ్చేలా చూసుకోవాలి. వ్యాపారస్తులకు, వృత్తిలో ఉన్నవారికి, ఉద్యోగస్థులకు చాలా బాగుంది.












Click it and Unblock the Notifications