• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాస్తు: గృహానికి దిశ మారితే ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయో తెలుసా?

|

ఇంటికి పడమర,దక్షిణ దిశలలో గల వీధి స్థలము

దిశమారుతే దశమారుతుంది.మనం స్వంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి అనేక రకాలుగా శ్రమపడతాము.మన కలలు కనే గృహం సాకారం కావలంటే మన దశ బాగుండాలి.జాతక ప్రకారం గృహ యోగానికి దశ అనుకూలంగా ఉన్నప్పుడు మనకు గృహాయోగం కలుగుతుంది.కాని మనం కట్టే ఇల్లు /కొనే ఇల్లు అన్ని విధములుగా వాస్తుశాస్త్ర ప్రకారం దిశలు అనుకూలంగా ఉండాలి. దిశ బాగలేకపోతే మన దశకూడ సహకరించదు.అందుకే అనుభవజ్ఞులైన పండితులను సంప్రదించి వారిచ్చే సూచనలను పాటిస్తే అన్ని విధములుగా అనుకూలంగా ఉంటుంది.గృహానికి దిశమారుతే వాస్తు పరంగా శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయో గమనించండి.

vastu changes for positivity in your home

ఇంటికి పడమర,దక్షిణ దిశలలో వీధులు కలిగి ఉంటే ఆ స్థలాన్ని నైరుతి బ్లాకు అంటారు. వాస్తు ప్రకారం ఉంటే ఈ నైరుతి బ్లాకు బాగా రాణిస్తుంది. నైరుతి బ్లాకులో పెద్దకట్టడాలు ఉండి వ్యాపార రంగంలో స్థరమైనస్థాయిని పొందిన భవనాలను మనం ఏన్నో గమనింపవచ్చు.

నైరుతిమూల మొత్తం స్థలానికంటే ఎత్తుగా ఉండాలి. నైరుతి ఎత్తువలన ఆదాయము అభివృద్ది కాకుండా కార్యసిద్ది కలుగును.

నైరుతిమూల దక్షిణ ఆగ్నేయంగా గాని పశ్చిమ వాయువ్యం గాని కొంచెం కాకుండా పెంపు లేకుండా ఖచ్చితంగా మూలమట్టానికి '90' డిగ్రీలు ఉండవలెను.

దక్షిణ నైరుతి పెరుగుట వలన నైరుతి వీధిపోట్ల వలన అందులో బావులు,బోర్లు ఉండి పల్లంగా ఉంటే అందులో నివసించే స్త్రీలు దీర్ఘవ్యాధిగ్రస్తులుగా ఉంటారు లేదా అకాలమరణము, యాక్సిడెంట్లు,ఆత్మహత్యలకు పాల్పడుట మొదలగునవి కాకుండా కొన్ని సందర్భాలలో హత్యచేయడటం, హత్యకు గురియగుట జరుగే అవకాశములు ఎక్కువగా ఫలితాలను సూచిస్తాయి.

ఇందులో స్త్రీలు అగౌరవమైన పనులకు పాల్పడుదురు. జైలుశిక్షలుకూడా అనుభవించుదురు.

పశ్చిమ నైరుతిలో పై దోషాలు ఉండిన పురుషులు దానికి సంబంధించిన దుష్పాలితాలను అనుభవించాల్సి వస్తుంది.

నైరుతి బ్లాకు స్థలానికి సింహ ద్వారాము ఏదో ఒకవైపు రోడ్డువైపు మాత్రమే ఏర్పాటు చేయవలెను.

ఈ బ్లాకు స్థలానికి ఎటువైపు రోడ్డు అయితే ఎక్కువ రద్దీగా ఉంటుందో అటువైపు సింహద్వారాము ఉంచుకొనవలెను.

గృహమునకు, గృహవరణకు పశ్చిమ వాయవ్యంలో గాని, దక్షిణ ఆగ్నేయంలో గాని ద్వారాలు ఉండాలి.

గృహమునకు, గృహవరణకు దక్షిణ, పశ్చిమ నైరుతిలలో ద్వారాలు ఉంటే అష్ట కష్టాలు, ప్రాణ నష్టాలను,అనారోగ్యంతో అనేక ఇబ్బందులతో జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు.

పడమర,దక్షిణాలలో గృహము ఫ్లోరింగ్ లెవెల్ కన్నా అరుగులు ఎత్తుగా ఉండాలి కాని పల్లంగా ఉండకూడదు.

దక్షిణం వాలువసార వలన స్త్రీలు, పశ్చిమ వాలువసార వలన పురుషులు పక్షవాతం, బొల్లి, కుష్ఠు, కేన్సర్ వంటి భయంకరమైన జబ్బులకు గురై ఆర్ధిక నష్టాలతో అవమానాలను అనుభవిస్తారు .

తూర్పు ఈశాన్యం తగ్గి, పశ్చిమనైరుతిలో ద్వారాలు ఉంటే అందులో పుత్ర సంతతికి ప్రాణనష్టము కలుగ జేస్తుంది.

గృహము ఉత్తరం హద్దుచేసి దక్షిణనైరుతిలో ద్వారమున్న అందుగల స్త్రీలు సుఖము లేనివారై ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఏక్కువగా ఉంటాయి.

గృహమునకు ఉత్తర ఈశాన్యం తగ్గిపోయి తూర్పు హద్దుపై నిర్మించి నైరుతి దోషాలు కలిగి ఉన్న ఇంట్లో పురుష సంతతి ఉండక దత్తత రావడమో ఇల్లరికపు అళ్ళుల్లకు ఆస్తి సంక్రమించడమో జరుగును.

నైరుతి తెగిపోవటంగాని, లోపించుటగాని జరుగకూడదు.ఈశాన్యంలో పొయ్యి ఉండి నైరుతిలో ద్వారాలు ఉండి ఇతర ఏ విధంగానైనా నైరుతి భ్రష్టుపట్టినయెడల అందులో ఉండే భార్యా భర్తలు అన్యోన్నతలు లోపించి వారు ఆత్మహత్యలకు పాల్పడడం లేదా భార్య - భర్తను గాని, భర్త - భార్యనుగాని హత్య చేయటం జరుగును.

నైరుతిలో పల్లంగా ఉండి బావిగాని ఉంటే ఆ స్థలంలో గృహము నిర్మింప తలపెట్టిన గృహయజమాని గృహము పూర్తికాక ముందుగాని గృహప్రవేశము జరిగిన కొన్నాళ్ళలోగాని మృత్యుగండం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఉత్తరంవైపు హద్దుచేసి దక్షిణం ఖాళీ స్థలం వదలి నిర్మించ తలపెట్టిన గృహము పూర్తికాక పోవటమో పూర్తి అయిన తరువాత యజమాని కాని యజమానురాలు గాని మరణించడం-ఆర్ధిక నష్టాలు కలుగడమే కాకుండా ఎన్నో ఆశలతో నిర్మించుకున్న ఆ గృహము అమ్ముకునే పరిస్థితి వస్తుంది.

నైరుతి భాగంలో ఎతైన అరుగులు చావడిలు నిర్మించడం, బరువులు వేయటం వలన ఆర్థికాదాయం కలుగును.

వంటగదిని ఆగ్నేయ దిశలో మంచిది వసతిలేని సందర్భంలో వాయవ్య గదులలో ఏర్పాటు చేసుకోవచ్చును.

నైరుతిగది వైశాల్యము ఈశాన్యంగది వైశాల్యం కన్నా ఎక్కువగా ఉండాలి.

దక్షిణ, పశ్చిమ, నైరుతి స్థలాలు ఇంటికి ఆనుకొని ఉన్నవి గాని దూరంగా ఉన్నవి కాని ఎట్టి పరిస్థితులోను కొనగూడదు.గృహనికి నైరుతిమూల ఎదేని నిర్మాణము చేయతలపెట్టినచో నిర్మాణము ఆగకుండా పని జరగాలి. ఒకవేళ నిర్మాణము ఆగిన యెడల తిరిగి కట్టుట కష్టమే కాకుండా ఆర్థిక, ప్రాణనష్టాలు సంభవించును. కావున గృహనిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువులను సమాకూర్చుకొని నిర్మాణము మొదలుపెట్టాలి.

గృహమునకు దక్షిణ, ప‌శ్చిమ‌, నైరుతుల‌లో ఏవేని నిర్మాణాలు చేయ‌త‌ల‌పెట్టినప్పుడు ప్లోరింగ్ విషయంలో మాత్రం పైక‌ప్పు లెవెల్ ఎంత మాత్రం ప‌ల్లంగా ఉండ‌కూడ‌దు, ఇది ముఖ్యమైన విషయం.

అన్ని విధాలుగా అనుకూలంగా మనం ఉండే ఇల్లు మన అభివృద్దికి సహకరించాలి అంటే తప్పక వాస్తు ప్రకారం నిర్మాణం చేసుకోవాలి.ఇల్లు మనం కట్టి అద్దేకు ఇచ్చినను లేదా యజామానే నివసించినను ఆ వాస్తు ఫలితం అనేది ఇంటి యజమానికి,అద్దే ఉండే వారికి సరిసమానంగా ఫలితాలను ఇస్తాయి ఇది గమనించి స్వంత ఆలోచనలు మాని వాస్తుశాస్త్ర సూత్రాలను పాటిస్తే గృహమే కధా స్వర్గసీమ అన్నట్టు ఉంటుంది.

డా. ఎం.నరసింహాచారి
తార్నాక - హైదారాబాద్
చరవాణి. 9440611151

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
In view of this, we look at some of the Vastu factors that tenants should look for ... a lot of changes in the flat,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more