కేశినేని నానికి ఎంపీ చిన్ని షాక్..! ఆదుకోని చంద్రబాబు పోస్ట్..!

విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)కి ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సైలెంట్ గా ఉంటున్న నానికి తన అనుచరుల్ని కాపాడుకోవడం కష్టంగా మారింది.భవిష్యత్తులో రాజకీయాలు చేయాలంటే కీలకమైన తన అనుచరులు ప్రస్తుతం ఆయన సోదరుడు, టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. దీంతో వారిని పోలీసులు టార్గెట్ చేశారు. చివరికి వీరిని కాపాడేందుకు నాని చంద్రబాబు సాయం కోరినా ఫలితం దక్కలేదు.

జగన్ కోసమేనా డీకే శివకుమార్ కు సీఎం ? రాహుల్ బిగ్ స్కెచ్..!
జగన్ కోసమేనా డీకే శివకుమార్ కు సీఎం ? రాహుల్ బిగ్ స్కెచ్..!

ఎంపీ కేశినేని చిన్ని అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నాని అనుచరుడు తాతినేని రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఆయన కోసం ఇంటికి వెళ్లి తల్లిని కూడా బెదిరించినట్లు నాని నిన్న ఆరోపించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబును ఆయన కోరారు. అయితే ఇవాళ రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో చంద్రబాబు కూడా కేశినేని నాని అభ్యర్ధనను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Blow to Kesineni Nani Aide Tatineni Rambabu Held for Anti-Chinni Social Media Post
బెజవాడలో మళ్లీ కేశినేని బ్రదర్స్ వార్..! చంద్రబాబు కోర్టులోకి బంతి...!
బెజవాడలో మళ్లీ కేశినేని బ్రదర్స్ వార్..! చంద్రబాబు కోర్టులోకి బంతి...!

ఎంపీ కేశినేని చిన్నిపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ నాని, ఆయన అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పటమట పోలీసులు.. తాతినేని రాంబాబుతో పాటు మరి కొంతమందిపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. కేశినేని చిన్ని పరువుకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై విచారణ చేసి తాతినేని రాంబాబుతో పాటు కొంతమందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈరోజు తాతినేని రాంబాబును అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఇతర నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+