దోషాలుంటే వాస్తు ప్రకారం భారీ మార్పులు చేయొద్దు.. ఈ చిన్న పని చాలు
వాస్తు లేకుండా ఇంటి నిర్మాణం జరగదు. ఏ కట్టడం అయినా వాస్తును అనుసరించే కడతారు. అయినా దోషాలున్నాయనిపిస్తే చాలామంది భారీగా మార్పులు చేస్తూ, చాలా భారీగా ఖర్చుపెడుతుంటారు. కానీ అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఎన్నడూ లేనంతగా సమస్యలు ముసురుకుంటుంటాయి. డబ్బు చేతిలో నిలవదు. సహాయం అందదు. వ్యతిరేక శక్తి ఇంట్లో ఉందేమో అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు వాస్తు దోషాలను తెలుసుకొని చిన్న చిన్న మార్పులు లేదంటే కొన్నిరకాల చిత్రపటాలను ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఖర్చు కూడా ఆదా అవుతుంది అని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
కమలాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా కొలుస్తారు.
కమలం చిత్రపటం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే.
ప్రతికూల శక్తి పారిపోతుంది.
దీన్ని తూర్పు దిశలో ఉంచాలి.

ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని ఉండే బుద్ధుడి చిత్రపటం పెట్టుకోవాలి.
తూర్పు దిశగా లేదంటే ఈశాన్యం దిశగా పెట్టుకోవాలి.
బుద్ధుడిని చూడగానే మనసులోని అలజడి మాయమైపోతుంది.
జారే జలపాతం అలజడి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
ఈ చిత్రపటం ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఈశాన్యంలో పెడితే ఆర్థికంగా మంచి వృద్ధి ఉంటుంది.
కొండలున్న చిత్రపటాన్ని పెట్టుకోవాలి.
మనిషి జీవితంలో పైకి చేరుకునేందుకు వేసే ప్రతి అడుగు ఎంతో కష్టంగా ఉంటుంది.
పైకి చేరుకున్న తర్వాత పొందే ఆనందం వేరు.
కష్టాలనే కొండను కచ్చితంగా ఎక్కాలి.
దీన్ని నైరుతి దిశలో ఉంచితే బాగా కలిసివస్తుంది.
గోడలకు మంచి చిత్రపటాలు పెట్టుకోవాలి.
దక్షిణం దిశగా పరిగెత్తే గుర్రాలున్న చిత్రపటాన్ని పెట్టుకోవాలి.
దీన్ని దక్షిణ దిశగా పెడితే కెరీర్ ఊపందుకుంటుంది.
పురి విప్పిన నెమలి చిత్రపటం ఉండాలి.
ఇది దక్షిణ దిశలో ఉంటే ఆదాయం పెరుగుతుంది.
నెమలి వల్ల అదృష్టం కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications