వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి?
మనిషి ఎప్పుడైతే సొంతంగా కట్టడం అనేది ప్రారంభించాడో అప్పటి నుంచి యుగయుగాలుగా వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. ఎన్ని యుగాలు పూర్తయినా దీనికున్న ప్రాధాన్యత మాత్రం చెక్కుచెదరడంలేదు. వాస్తు శాస్త్రం అనేది కేవలం నమ్మకం మాత్రమేనా లేక అందులో ఏదైనా శాస్త్రీయత ఉందా? అనే అంశంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. అయితే దీన్ని ఒక అద్భుతమైన నిర్మాణ శాస్త్రంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో వాస్తు అనేది తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం.
కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా కొన్నప్పుడు వాస్తు బాగుండాలి.
అలా ఉంటే ఆ ఇంట్లో ఉండేవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవిస్తారు.
"అన్నీ బాగున్నాయి" అనే పాజిటివ్ ఆలోచన మనిషి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

వాస్తు అనేది ప్రకృతిలోని భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మధ్య సమతుల్యతను సాధించే ప్రక్రియ. ఇది శాస్త్రీయం.
తూర్పు దిశలో కిటికీలు, తలుపులు ఉండాలని వాస్తు చెబుతోంది.
ఉదయాన్నే వచ్చే అతినీలలోహిత కిరణాలు
ఇంట్లోని బ్యాక్టీరియాను చంపేస్తాయి.
ఇంటికి డి-విటమిన్, వెలుతురును అందిస్తాయి.
ఇంటి నిర్మాణం గాలి ధారాళంగా వీచేలా ఉండాలి.
దీనివల్ల ఇంట్లోని కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్లి తాజా గాలి వస్తుంది.
ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
భూమి అయస్కాంత క్షేత్రం ఉత్తర-దక్షిణ దిశల్లో ఉంటుంది.
అందుకే దక్షిణ దిశలో తలపెట్టి పడుకోవాలని వాస్తు చెబుతుంది.
దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
ఒక క్రమపద్ధతిలో, విశాలంగా, వెలుతురుతో ఉన్న ఇంట్లో నివసించాలి.
దీనివల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
వస్తువులను ఇష్టారాజ్యంగా కాకుండా, ఒక పద్ధతిలో అమర్చుకోవాలి.
దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.
దీనినే ఆధునిక కాలంలో 'స్పేస్ డిజైనింగ్' అంటున్నారు.
వాస్తును ఫాలో అవ్వాలా? వద్దా? అనేది వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడివుంటుంది.
దీన్ని అనుసరించడంలో కొన్ని పరిమితులు కూడా పాటించాలి.
మూఢనమ్మకం కాకూడదు ఆ నమ్మకం.
వాస్తు పేరుతో ఇప్పటికే ఉన్న ఇంటిని పూర్తిగా కూల్చివేయడం
లేదా విపరీతమైన భయానికి లోనుకావడం సరైనది కాదు.
వాస్తు నియమాలు పాటించే క్రమంలో ఇంటి సౌకర్యాన్ని వదులుకోకూడదు.
గాలి, వెలుతురు, నీరు వంటి ప్రకృతి వనరులను సమర్థవంతంగా వాడుకోవడమే వాస్తు శాస్త్రం అసలు ఉద్దేశం.












Click it and Unblock the Notifications