వాస్తు ప్రకారం ఈ చిన్న మార్పుతో మీ తలరాతే మారిపోతుంది
ఇల్లు వాస్తు ప్రకారం ఉంటే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులంతా సంపద, సంతోషంతో కళకళలాడుతుంటారు. ఆర్థికంగా, మానసికంగా బాగుంటారు. అన్నింటికన్నా ప్రధానమైనది ఇంటికి ప్రధాన ద్వారం. సానుకూల శక్తిని ఆహ్వానించి, ప్రతికూల శక్తిని పారద్రోలి కుటుంబాన్ని సంరక్షించేదిగా ఈ సింహద్వారం ఉంటుంది. ఇది సరైన దిశలోనే ఉండాలి.
ఇంటికి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారం అంటారు.
తప్పు దిశలో ఉంటే ఒత్తిడి, ఆందోళనలు, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
దక్షిణం వైపు ఉండటం అంతగా శుభప్రదం కాదని భావిస్తారు.
దీనివల్ల అనారోగ్య సమస్యలు, విభేదాలు తలెత్తుతాయి.

తూర్పు మంచిదని వాస్తు చెబుతోంది.
దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సూర్యకిరణాలు ఇంట్లో పడితే ఆ ఇల్లు పవిత్రంగా మారుతుంది.
ఉత్తరం వైపు దిశ కుబేరుడిది.
దీనివల్ల వ్యాపార వృద్ధి, పదోన్నతులు లభిస్తాయి.
ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.
ప్రధాన ద్వారాన్ని సరైన కొలతలతో సరిగ్గా అమర్చితే ప్రభావం మరింతగా పెరుగుతుంది.
పగిలిన తలుపులు, రంగు వెలిసిపోయిన తలుపులు ఉండకూడదు.
దీనివల్ల ప్రధాన ద్వారా వ్యతిరేక శక్తిని ఆహ్వానిస్తుంది.
తలుపు ముందు చీకటి లేకుండా చూసుకోవాలి.
దీపం ఏర్పాటు చేస్తే మరింత శుభం కలుగుతుంది.
పడమర, దక్షిణం సింహద్వారం ఉంటే అప్పులు పెరుగుతాయి.
ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
అనుకోని ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది.
సరైన దిశలో ప్రధాన ద్వారం నిర్మిస్తేనే శాంతి కలుగుతుంది.
దీనికి వాస్తు నిపుణులను సంప్రదించి తలుపును చూపించాలి.
తేడాలుంటే మార్పులు చూసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications