వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం ఎటు నుంచి ఎటు మొదలు పెట్టాలి?
కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది ఒక సామాన్యుడి జీవితకాల స్వప్నం. ఆ స్వప్నం ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రశాంతంగా పూర్తి కావాలంటే కేవలం డబ్బు, మనుషులు ఉంటే సరిపోదు.. సరైన 'వాస్తు ప్రణాళిక' కూడా ఉండాలి. ఇంటి నిర్మాణం ప్రారంభించే దిశ, స్థల ఎంపిక ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తాయి.
ఇంటి నిర్మాణంలో ప్రతి అడుగు శాస్త్రోక్తంగా పడితే, ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్మకం. ముఖ్యంగా నిర్మాణం ఎటువైపు నుంచి మొదలుపెట్టాలి? స్థలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి నిర్మాణం ఎప్పుడూ నైరుతి మూల నుంచి
ప్రారంభించడం అత్యంత శ్రేష్ఠం.
దక్షిణం లేదా పడమర దిశల నుంచి గోడల నిర్మాణం మొదలుపెట్టాలి.
నైరుతి దిశను 'పితృ స్థానం' లేదా 'రాహు స్థానం' అంటారు.
ఈ మూల ఎప్పుడూ బరువుగా, ఎత్తుగా ఉండాలి.
నిర్మాణం ఇక్కడి నుంచి మొదలుపెట్టడం వల్ల ఆ స్థలానికి ఒక రకమైన 'స్థిరత్వం' వస్తుంది.
దీనివల్ల పనులు మధ్యలో ఆగకుండా సాఫీగా సాగుతాయి.

మొదట నైరుతి మూలను పూర్తి చేసి, ఆ తర్వాత క్రమంగా వాయువ్యం,
ఆగ్నేయం దిశల వైపు వెళ్లాలి. చివరిగా ఈశాన్యం వైపు నిర్మాణం ముగించాలి.
స్థలంలో దోషాలు ఉంటే ఎంత మంచి ముహూర్తంలో కట్టినా ఆటంకాలు ఎదురవుతాయి.
కాబట్టి నిర్మాణం చేపట్టే స్థలం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్థలం చతురస్రంగా లేదా దీర్ఘచతురస్రంగా ఉండాలి.
మూలలు తెగిపోయినస్థలాలు ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి.
మీ స్థలానికి ఎదురుగా రోడ్డు వచ్చి ఆగుతుంటే అది 'వీధిపోటు' అవుతుంది.
ఈశాన్య వీధిపోటు శుభప్రదమైతే, నైరుతి లేదా ఆగ్నేయ వీధిపోట్లు ప్రమాదకరం.
వీటిని నివృత్తి చేసుకున్న తర్వాతే పని మొదలుపెట్టాలి.
స్థలంలో గతంలో ఎముకలు, బొగ్గులు లేదా పాత శిథిలాలు ఉంటే
వాటిని పూర్తిగా తొలగించి, కొత్త మట్టితో నింపాలి.
దీనినే 'శల్య దోష నివారణ' అంటారు.
నిర్మాణానికి దిశ ఎంత ముఖ్యమో, పనుల క్రమం కూడా అంతే ముఖ్యం.
పునాది కోసం గొయ్యి తీసేటప్పుడు మాత్రం మొదట ఈశాన్యం లో మొదలుపెట్టాలి.
ఎందుకంటే ఈశాన్యం తేలికగా ఉండాలి.
పునాది రాళ్లు లేదా పిల్లర్లు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా
నైరుతి లోనే మొదటి రాయి వేయాలి. దీనినే 'శంకుస్థాపన' అంటారు.
పని మొదలుపెట్టే ముందు గణపతి పూజ, భూమి పూజ నిర్వహించడం వల్ల
దుష్టశక్తులు, గ్రహ దోషాలు తొలగిపోతాయి.
నిర్మాణం జరుగుతున్నంత కాలం స్థలంలో ఒక చిన్న గదిని నిర్మించి,
అందులో దైవ ప్రార్థన చేయడం లేదా కాపలాదారుని ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.












Click it and Unblock the Notifications