వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి?
ఇంట్లో క్యాలెండర్ అనేది కేవలం తేదీలను చూసే కాగితం మాత్రమే కాదు, అది మన సమయానికి, అభివృద్ధికి సంకేతం. వాస్తు శాస్త్రం ప్రకారం క్యాలెండర్‌ను తప్పు దిశలో ఉంచితే కాలం మనకు కలిసిరాదని, అదే సరైన స్థానంలో ఉంటే అదృష్టం తలుపు తడుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం ప్రతిరోజూ చూసే వస్తువుల్లో క్యాలెండర్ ఒకటి. కొత్త ఏడాది రాగానే గోడకు కొత్త క్యాలెండర్ తగిలించడం మనకు అలవాటు.
అయితే, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ క్యాలెండర్‌ను తగిలించేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే ప్రమాదం ఉందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. సమయం మనకు అనుకూలించాలన్నా, చేసే పనుల్లో విజయం దక్కాలన్నా మన ఇంట్లోని క్యాలెండర్ సరైన దిశలో ఉండటం ముఖ్యం. చిన్న మార్పే అయినా అది మీ జీవితంలో పెద్ద సానుకూల మార్పుకు కారణం అవుతుంది.

చాలా మందికి ఇంటి ప్రధాన ద్వారం పైన
లేదా తలుపు పక్కనో క్యాలెండర్ తగిలిస్తుంటారు.
వాస్తు ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు.
ప్రధాన ద్వారం నుంచి లక్ష్మీదేవి, సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
అక్కడ క్యాలెండర్ ఉంచడం వల్ల ఆ శక్తి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి.
అది ఇంట్లో కుటుంబ సభ్యుల ఆయుష్షుపై లేదా ప్రగతిపై ప్రభావం చూపుతుంది.
తలుపుల వెనుక లేదా కిటికీలకు ఎదురుగా క్యాలెండర్లను ఉంచకూడదు.
క్యాలెండర్ పేజీలు గాలికి ఎగరడం వల్ల ఇంట్లో అశాంతి, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.
పాత క్యాలెండర్ల మీద కొత్తవి తగిలించడం కూడా మీ ఎదుగుదలను ఆపేస్తుంది.
క్యాలెండర్ ఉంచడానికి తూర్పు గోడ అత్యంత శుభప్రదమైనది.
సూర్యుడు ఉదయించే ఈ దిశ శక్తికి, కీర్తికి కారణం.
తూర్పు దిశలో క్యాలెండర్ ఉంటే కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
సంపదకు అధిపతి అయిన కుబేరుడి దిశ ఉత్తరం.
ఈ గోడపై క్యాలెండర్ ఉంచడం వల్ల ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది.
దక్షిణ దిశలో క్యాలెండర్‌ను అస్సలు ఉంచకూడదు.
దక్షిణం యమస్థానంగా పరిగణించబడుతుంది.
ఈ దిశలో క్యాలెండర్ ఉంటే అది ఇంట్లో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
తరచూ పనులు ఆగిపోతుంటాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్యాలెండర్‌పై హింసాత్మక చిత్రాలు,
ఏడుస్తున్నట్లు ఉండే బొమ్మలు లేదా
ఎండిపోయిన చెట్లు ఉండకూడదు.
ఇవి మానసిక ఒత్తిడిని పెంచుతాయి.
దేవుళ్ల చిత్రాలు, ప్రకృతి దృశ్యాలు
లేదా పచ్చదనంతో కూడిన క్యాలెండర్లను
ఎంచుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది












Click it and Unblock the Notifications