బెంగాల్ లో అధికారం పక్కా వారిదే, ఆ పార్టీ సీన్ రివర్స్ - పబ్లిక్ మూడ్ క్లియర్..!!
పశ్చిమ బెంగాల్ లో తొలి విడత పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. పోలింగ్ సమీపిస్తున్న వేళ పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అధికారం నిలబెట్టుకొనేందుకు మమతా.. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బీజేపీ హోరా హోరీగా ముందుకు వెళ్తున్నాయి.అయితే, బెంగాల్ లో ప్రజలు ఎవరి వైపు... అధికారం ఎవరికి దక్కుతుందనే అంచనాలను ప్రముఖ అధ్యయన సంస్థ ప్రజా నాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది. కీలక అంశాలను వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ లో మమత వర్సస్ బీజేపీ పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. 2021 లోనే ఈ రెండు పక్షాల మధ్య రాజకీయ యుద్దం తారా స్థాయిలో జరిగింది. అప్పటి నుంచే 2026 ఎన్నిక లే లక్ష్యంగా రెండు వైపులా వ్యూహాలు అమలు చేసారు. మమతా తన పాలన వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారనే ధీమాతో ఉన్నారు. అయితే, చొరబాట్లు.. ప్రభుత్వం పైన వ్యతిరేకత.. హిందుత్వ అజెండా తమకు కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. ప్రధాని మోదీ సహా ముఖ్య నేతలంతా బెంగాల్ లో ప్రచారం కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ తరువాత మమతకు అనుకూలంగా ఉన్న పలువురు అధికారులను బదిలీ చేసారు. కాగా.. బెంగాల్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏంటనేది ప్రముఖ ఎన్నికల అంచనా సంస్థ ఎస్ఏఎస్ వెల్లడించింది. 2021 లో ఈ సంస్థ వెల్లడించిన అంచనాలకు తగినట్లుగా దాదాపుగా ఫలితాలు వెల్లడయ్యాయి.

బెంగాల్ లో మరోసారి మమత కే ఛాన్స్..!
ఇక, ఈ సారి ఎన్నికల్లో హోరా హోరీ పోరు ఉన్నా... బెంగాల్ ఓటర్లు మమతకే పట్టం కట్టడం ఖాయమని ఈ సర్వే తేల్చేసింది. బెంగాల్ లో నాలుగు ప్రాంతాల లెక్కన ఈ సర్వే అన్ని వయసు .. వర్గాల వారీగా నిర్వహించింది. అందులో మమతకు చెందిన టీఎంసీ 170 -195 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనాగా వెల్లడించింది. 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో 146 మేజిక్ ఫిగర్. కాగా, బీజేపీకి 107 - 130 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 2-6 వరకు వచ్చే అవకాశం ఉందని వివరించింది. మమత ద్వారానే పశ్చిమ బెంగాల్ గుర్తింపు కొనసాగుతుందని మెజార్టీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ప్రధాని మోదీ, అమిత్ షా మినహా స్థానిక నాయకత్వం పైన బెంగాల్ ప్రజల్లో ఆదరణ కనిపించటం లేదు. బీజేపీ లో ముఖ్య నేతల అంతర్గత కలహాలు పార్టీకి నష్టం చేస్తున్నాయి. దీంతో.. మరోసారి ఖచ్చితంగా మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని ఈ ఎన్నికల అధ్యయన సంస్థ విశ్లేషిస్తోంది.













Click it and Unblock the Notifications