ఓటీటీలోకి మంచు లక్ష్మి జబర్దస్త్ మూవీ.. ఇక రచ్చ రచ్చే..

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'లేచింది మహిళా లోకం'.. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 22 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుందీ మూవీ. ఈ మేరకు సన్ నెక్ట్స్ నుంచి తాజాగా అధికారిక ప్రకటన వెల్లడైంది. అయితే ఈ మూవీ మార్చి 26న థియేటర్లలో విడుదలైనా.. అసలు ఈ మూవీ రిలీజ్ అయినట్లు ఎవరికీ తెలియదు.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

మంచు లక్ష్మి లేచింది మహిళా లోకం మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకులేకపోయింది. అయితే ఏప్రిల్ 22 నుంచి ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మరి 'లేచింది మహిళా లోకం' సినిమా ఓటీటీలో అయినా హిట్ అవుతుందా..? లేదా..? అన్నది చూడాలి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. భార్యాభర్తల మధ్య రిలేషన్, విడాకులు, కోర్టు కేసులు, స్త్రీ పురుషుల మధ్య వివక్ష తదితర అంశాలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు కార్తిక్- అర్జున్ దర్శకత్వం వహించారు. దర్శకుడు ఈ మూవీని సెటైరికల్ గా చూపించే ప్రయత్నం చేశారు.

ManchuLakshmi latest Comedy Film Lechindi Mahila Lokam to Premieres on Sun NXT Starting April 22

లేచింది మహిళా లోకం మూవీలో మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, శ్రీరామ చంద్ర తదితరులు నటించారు. ఈ మహిళలు తమ రోజూవారీ జీవితంలో చిన్న చిన్న అవమానాలు, ఆంక్షలను ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే అప్పటి వరకూ బాధలను అనుభవించిన మహిళలు.. ఇలానే ఎందుకు ఉండాలి..? అని తిరగబడతారు. దాంతో ఈ మార్పుల కారణంగా ఇళ్లల్లోని భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారన్నదే స్టోరీ లైన్.. ఈ మూవీ ఏప్రిల్ 22 నుంచి ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+