పాకిస్థాన్ పార్లమెంటులో మహిళలు ఎంతమందో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
భారత పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో వీగిపోయిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి లోక్ సభలో ఓటింగ్ కోసం మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. అందులో 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా 230 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన రెండు మూడవ వంతు మెజారిటీ(352 ఓట్లు) రాకపోవడంతో బిల్లు తిరస్కరణకు గురైంది.
అయితే ఇప్పుడు భారత్ కు దాయాది దేశమైన పాకిస్థాన్ లో మహిళల పరిస్థితి ఎలా ఉంది..? పాకిస్థాన్ పార్లమెంటులో మహిళలకు ఎంత రిజర్వేషన్ ఉంది..? పాకిస్థాన్ పార్లమెంటులో ఎంతమంది మహిళలు ఉన్నారు..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక పాకిస్థాన్ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కఠిన నిబంధనలు ఉన్నాయి. కేవలం రిజర్వేషన్ సీట్లు మాత్రమే కాకుండా.. మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేకమైన రూల్స్ ను తీసుకొచ్చాయి.
ఆ వివరాలు ఓసారి చూస్తే ప్రతి రాజకీయ పార్టీ తమ మొత్తం అభ్యర్థుల్లో కనీసం 5 శాతం టికెట్లను మహిళా అభ్యర్థులకు కేటాయించడం తప్పనిసరి చేసింది. అలాగే ఏదైనా నియోజకవర్గంలో మహిళా ఓటర్ల నమోదు 10 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ నియోజకవర్గంలోని ఎలక్షన్ రిజల్ట్స్ ను రద్దు చేసే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. ఇక పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మహిళలకోసం 60 సీట్లు కేటాయించారు. అలాగే ఎగువ సభ అయిన సెనేట్ లో 17 సీట్లను రిజర్వ్ చేశారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వడంలో రువాండా ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. ఇక్కడి పార్లమెంట్ దిగువ సభలో మహిళల సంఖ్య 61 శాతం కంటే ఎక్కువే కావడం గమనార్హం. అలాగే క్యూబా, నికర్గువా, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో మహిళా ఎంపీల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువగానే ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications