వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: కర్పూరంతో ఆరోగ్యసమస్యల నుండి ఆర్ధికనష్టాల వరకు అన్ని సమస్యలు పరార్.. ఎలాగంటే!!

|
Google Oneindia TeluguNews

ప్రతి ఒక్కరూ పూజగదిలో కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కర్పూరాన్ని హారతి ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తారు చాలామంది. కానీ కర్పూరానికి ఆరోగ్య సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల వరకు ప్రతి సమస్యలు తొలగించే అద్భుతమైన శక్తి ఉందని వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కర్పూరం ఇంట్లో ఉన్న ప్రతికూలతను దూరం చేస్తుందని సూచిస్తున్నారు.

కర్పూరంతో నెగిటివ్ ఎనర్జీ మాయం

కర్పూరంతో నెగిటివ్ ఎనర్జీ మాయం

హిందూ మతంలో దేవుని ఆరాధించడానికి చాలామంది పూజ సమయంలో ఉపయోగించే పూజ సామానులతోపాటు కర్పూరంతో హారతి కూడా ఇస్తారు. కర్పూరంతో హారతి ఇస్తే భగవంతుడు ప్రసన్నుడౌతాడని చాలామంది విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి, రెండు పూటలా కర్పూరహారతి ఇవ్వాలని చెప్తారు. ఇలా చేస్తే ఆ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతారు. ఇక భగవంతునికి కర్పూరహారతి ఇవ్వడంతోపాటు గా ఇంట్లో అన్ని గదులు అన్ని మూలలకు కర్పూరాన్ని వెలిగించి కర్పూర హారతి పొగ వేయడం వల్ల అది ఇంట్లో ఏ గదిలో అయినా ప్రతికూల శక్తి ఉంటే దాన్ని కచ్చితంగా తొలగిస్తుంది.

ఆరోగ్యానికి కర్పూరంతో మేలు.. అన్ని పనుల విజయానికి కర్పూరం

ఆరోగ్యానికి కర్పూరంతో మేలు.. అన్ని పనుల విజయానికి కర్పూరం

ఇంట్లో సానుకూల శక్తి ఉండేలాగా కర్పూరం చేస్తుంది. అంతేకాకుండా ఈ పొగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్పూరంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కర్పూరం శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా దృఢంగా ఉంచేలా కండరాల సమస్యలు తొలగించేలా చేస్తుంది. దేవుని గదిలో మాత్రమే కాకుండా మన దగ్గర కూడా కర్పూరాన్ని పెట్టుకున్నట్లైతే అంతా మంచి జరుగుతుందని చెబుతారు. కర్పూరాన్ని మన దగ్గర ఉంచుకోవడం వల్ల మన పైకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. కర్పూరాన్ని పర్సులో కానీ జేబులో కాని పెట్టుకోవడం వల్ల అది మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రశాంతమైన మనసుతో చేసే ఏ పని అయినా విజయవంతం అవుతుంది.

కర్పూరం మన దగ్గర ఉంచుకోవటం వల్ల బోలెడు ప్రయోజనాలు .. ఆర్ధిక స్థితి మెరుగుదల

కర్పూరం మన దగ్గర ఉంచుకోవటం వల్ల బోలెడు ప్రయోజనాలు .. ఆర్ధిక స్థితి మెరుగుదల

కర్పూరానికి చల్లదనాన్ని ఇచ్చే గుణం వల్ల అది స్థిమితంగా ఆలోచించే గుణాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి కర్పూరాన్ని దేవుని గది లోనే కాకుండా మన దగ్గర కూడా పెట్టుకుంటే చేసే ప్రతి పని విజయవంతం గా సాగుతుంది. అయితే కర్పూరాన్ని ఎడమ వైపు ఉన్న జేబులో మాత్రమే పెట్టుకోవాలి. ఇక పర్సులో కర్పూరాన్ని పెట్టినా ఆ పర్సును కూడా ఎడమ వైపు పాకెట్ లోనే ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం కర్పూరం మన ఎడమవైపు ఉంటేనే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కర్పూరాన్ని ఒక తెల్లని గుడ్డలో కట్టి మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీ జాతకంలో శుక్రుడు బలహీన స్థితిలో ఉంటే ఆ స్థితి మెరుగు పడుతుంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని అనుసరిస్తే ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది.

దోషాల ఉపశమనం కోసం కూడా కర్పూరం ఉపయుక్తం

దోషాల ఉపశమనం కోసం కూడా కర్పూరం ఉపయుక్తం

మీ జాతకంలో సర్పదోషం, రాహు కేతు దోషాలు ఉన్నా కర్పూరం ఆ దోషాలు తొలగించడానికి చాలా ఉపయోగపడుతుంది. రుమాలు లో కర్పూరాన్ని కట్టి మీ దగ్గర ఉంచుకోవడం వల్ల దోషాల ప్రభావం నుండి కాస్త ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి పూజ గదికే కర్పూరాన్ని పరిమితం చేసి చూడకుండా, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ని తొలగించడానికి, ఆరోగ్య సమస్యల నుండి, ఆర్థిక సంక్షోభాల నుండి బయట పడడానికి కర్పూరాన్ని ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు.


disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that all problems from health problems to financial losses can be solved with camphor and camphor removes the negatives in the house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X