
vastu tips: మీ ఇంటికి పావురాలు వస్తున్నాయా? శుభమా.. అశుభ సంకేతమా.. తెలుసుకోండి!!
చాలామంది ఇళ్లల్లోకి పావురాలు వస్తూపోతూ ఉంటాయి. అంతేకాదు కొంత మంది ఇళ్ళల్లో పావురాలు గూడు కట్టుకొని మరీ కాపురం చేస్తాయి. ఆ ఇంటి పరిసరాలలోనే జీవిస్తాయి. అయితే ఇళ్లల్లోకి పావురాలు రావడంపై చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పావురాలు ఇంట్లో ఉండటం ఆనందానికి శాంతికి చిహ్నంగా భావిస్తే, పావురాల వల్ల లక్ష్మీదేవి వస్తుందని భావిస్తే, మరికొందరు పావురాలను దురదృష్ట సంకేతంగా భావిస్తారు.

పావురాల గురించి వాస్తు శాస్త్రం చెప్పిందిదే
వాస్తు ప్రకారం పావురాన్ని లక్ష్మీదేవి దూతలుగా పరిగణిస్తారు. పావురాన్ని శాంతి మరియు ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. కానీ పావురాలు ఇంట్లోకి రావడం పైన చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పావురం ఇంట్లో ఉండటం శ్రేయస్కరం అని భావిస్తే, మరికొంతమంది పావురం ఇంట్లో ఉండటం దరిద్రం అని చెబుతున్నారు. ఇక పావురాలు తలపైన ఎగిరితే వాస్తు ప్రకారం మంచిదని చెబుతున్నారు. అలా పావురాలు తలపైన ఎగిరిన వారి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు. బయటకు వెళ్లే సమయంలో పావురాలు మన కుడివైపు నుంచి ఎగిరితే అది శ్రేయస్కరం కాదని చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రంలో పావురాలను గురించి చెప్పింది ఇదే
ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే పావురం ఇంట్లోకి రావడం వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని, కానీ పావురం ఇంట్లో ఏదో ఒక మూలన గూడు కట్టడం ప్రారంభిస్తే మాత్రం అది అశుభం అని చెబుతున్నారు. అలా పావురం ఇంట్లో గూడు కట్టడం వల్ల ఇంటికి పేదరికం వస్తుందని సూచిస్తున్నారు. పావురం ఇంట్లో గూడు కడితే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని, అందుకే పావురాలను ఇళ్లల్లో గూళ్ళు కట్టడానికి అనుమతించకూడదని చెబుతున్నారు.

పావురాలు గూడు కడితే ఆ ఇంట్లో దురదృష్టమే
పావురాలు బాల్కనీ వద్ద కానీ, టెర్రస్ మీద కానీ గూడు కట్టుకోవడం అంటే దురదృష్టాన్ని తీసుకురావడమే అని చెబుతున్నారు. అలా గూడు కట్టుకుంటే దానిని వెంటనే తొలగించాలని, లేదంటే తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. పావురాలు ఇళ్లల్లో గూడు కడితే ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల పురోగతి తో పాటు, ఆర్థిక పరిస్థితిపై కూడా చెడు ప్రభావం ఉంటుందని సూచిస్తున్నారు.

పావురాలకు ఆహారం పెడితే దోషాల నివారణ
అయితే మరి కొందరు పావురాలు ఇంట్లో తిరగడం మంచిదని, పావురాలు గూడు కడితే ఆ ఇంటికి అదృష్టం వస్తుందని భావిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా పావురాలకు సంబంధించిన అనేక నమ్మకాలు సమాజంలో ఉన్నాయి. పావురాలకు ధాన్యం, గింజలు పెట్టడం వల్ల జాతకంలో ఉన్న గురు, బుధ గ్రహాలు స్థానం బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. పావురాలు ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని నమ్ముతారు.

పావురాలకు గింజలు పెడితే కలిగే మేలు ఇదే
ఇక ఎవరైనా వివాహాలు, ప్రేమ వ్యవహారాలలో సమస్యలు ఉంటే వారి పావురానికి ధాన్యం గింజలు పెడితే మంచిదని, వారి వివాహానికి అడ్డంకులు, ప్రేమ ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. పావురాలకు ఆహారం పెడితే అవి ఇంటికి రావడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో అవి తమ విసర్జనలతో మురికిని కూడా సృష్టిస్తాయి. అప్పుడు వాటిని శుభ్రం చేయకపోతే, దాని వల్ల ఆరోగ్యం పాడవుతుందని, రాహు గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.