vastu tips: స్థలం కొంటున్నారా? భూమికి ఈ లక్షణాలుంటే సర్వనాశనం.. కొనొద్దు!!
స్థలం కొనాలనుకుంటే కొన్ని లక్షణాలు ఉన్న స్థలం కొనుగోలు చెయ్యటం అశుభం అని, అలాంటివి కొంటే జీవితం సర్వ నాశనం అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఎక్కడైనా సరే ఏదైనా స్థలాన్ని కొనుగోలు చేయాలి అనుకునేవారు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు ఏమిటి? ఎటువంటి స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు? ఎటువంటి స్థలాన్ని కొనుగోలు చేయకూడదు? మంచి స్థలానికి ఉండే లక్షణాలు ఏమిటి? ఎటువంటి స్థలం కొనుగోలు చేస్తే వారికి నష్టం చేస్తుంది? వంటి అనేక అంశాలు వాస్తు శాస్త్రంలో సవివరంగా చెప్పబడ్డాయి. కాబట్టి ఎవరైనా సరే స్థలాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటే ఆ భూమి యొక్క లక్షణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమికి ఉన్న వాస్తు దిశలు, మూలలు, వీధి పోట్లు, గతంలో ఆ భూమి దేనికి ఉపయోగించారు వంటి అనేక వివరాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది.

భూమి కొనుగోలుకు సాధారణ నియమాలు ఇవే
భూమిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు భూమి లక్షణం తెలుసుకోవాలి. అసలు ఆ భూమిని అంతకుముందు ఎందుకు ఉపయోగించారు. ప్రస్తుతం కొనుగోలు చేసుకుని ఇల్లు కట్టుకుంటే నివసించడానికి అనుకూలంగా ఉంటుందా లేదా వంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా స్థలం మంచిదా కాదా అనేది కచ్చితంగా చూసుకోవాలి. ఇక భూమి పరీక్షకు సంబంధించిన సాధారణ నియమాలను ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

స్థలం కొంటే చూడాల్సింది వాస్తు
స్థలం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అశుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు చూడాల్సింది రేటు కాదు వాస్తు. వాస్తు బాగా ఉన్న స్థలాలు కొనుగోలు చేస్తే బాగా కలిసి వచ్చి సంపద వర్షం కురిసే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకు వచ్చాయని వాస్తు లేని స్థలాలు కొనుగోలు చేస్తే ఉన్న సంపద అంతా పోయి సర్వనాశనం అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి.

ఇలాంటి లక్షణాలు ఉన్న భూములు అసలు కొనొద్దు
ఇక భూమిని కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన సాధారణ నియమాలలో ముఖ్యమైనది ఆ భూమి ఏ లక్షణాలతో ఉంది. అది కొనుగోలు చేస్తే నివాస యోగ్యమా కాదా అన్నది చూడాలి. కొనుగోలు చేసే భూమిలో చెదపురుగులు, ఎలుకల బొరియలు. ముళ్ళ చెట్లు. పాముల పుట్టలు ఉంటే కొనుగోలు చేయకూడదు. కొనుగోలు చేయాలనుకుంటున్న భూమి బంజరు భూమి అయితే కొనుగోలు చేయకూడదు. కొనుగోలు చేయాలనుకుంటున్న స్థలం విపరీతంగా నెర్రెలు బారే నేల రకం అయితే కొనుగోలు చేయకూడదు. బాగా కఠినంగా ఉన్న భూములు మన జీవితంలో శత్రువులను పెంచుతాయి.

తవ్వితే బూడిద, ఎముకలు, బొగ్గులు వచ్చే భూములు కొంటే జరిగేదిదే
గుంతలు, మట్టి దిబ్బలతో ఉన్న భూములను కొనుగోలు చేస్తే అవి నాశనాన్ని, విపత్తును తీసుకువస్తాయి. అష్ట వంకర్లు ఉన్న భూములను కొనుగోలు చేస్తే అది సోదరులను నాశనం చేస్తుంది .ఇక భూమిలో గొయ్యి తవ్వినప్పుడు బూడిద కానీ, ఎముకలు కానీ, బొగ్గు కానీ ఉంటే ఆ భూమి అశుభాలకు కేంద్రం అవుతుంది. ఇటువంటి భూములను పొరపాటున కొనుగోలు చేస్తే ఊహించని దొంగతనాలు, భయంకరమైన రోగాలు, మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి పూర్తిగా నశిస్తుంది. అందుకే కొనుగోలు చేసే భూమి ఇంతకుముందు దేనికోసం ఉపయోగించారు అనే అంశాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications