వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Vastu tips: తూర్పువీధి ఇంటికి ఈ వాస్తుదోషాలుంటే అన్నీ కష్టాలే.. అంతా నష్టమే; నివారణా మార్గాలివే!!

|
Google Oneindia TeluguNews

తూర్పు వీధి గల ఇంటికి శుభ ఫలితములు రావాలంటే ఆ స్థలం ఏ విధంగా ఉండాలి? ఎలాంటి వాస్తు నియమాలను పాటిస్తే ఆ స్థలం శుభఫలితాలనిస్తుంది వంటి అనేక విషయాలను వాస్తు శాస్త్రం పేర్కొంది. వాస్తు శాస్త్రంలో తూర్పు వీధికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తూర్పు వీధి ఉండటం శుభసూచకం అని చెప్తారు. అలాంటి తూర్పు వీడి ఇంటి వాస్తు దోషాల గురించి తెలుసుకుందాం.

తూర్పు వీధి ఇంటికి ఈశాన్యం తగ్గితే అనారోగ్యాలు, ఆర్ధిక నష్టాలు

తూర్పు వీధి ఇంటికి ఈశాన్యం తగ్గితే అనారోగ్యాలు, ఆర్ధిక నష్టాలు

తూర్పు వీధి గల ఇంటికి ఈశాన్య దిశ తగ్గితే, ఆగ్నేయం పెరిగితే ఆ ఇంట్లో ఎటువంటి శుభ ఫలితాలు రావని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తూర్పు వీధి గల ఇంటికి ఈశాన్యం తక్కువగా ఉన్నప్పుడు, ఈశాన్యం కంటే ఆగ్నేయం పెరగకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తూర్పు వీధి ఉన్న ఇంటికి ఒకవేళ ఈశాన్యం తగ్గితే అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలు పెరుగుతాయి.

తూర్పు దిశ ఎత్తుగా ఉండి పడమర పల్లంగా ఉన్నా ప్రమాదమే

తూర్పు దిశ ఎత్తుగా ఉండి పడమర పల్లంగా ఉన్నా ప్రమాదమే


తూర్పు దిశ ఎత్తుగా ఉండి పడమర దిశ పల్లంగా ఉంటే ఇంటి యజమాని అనారోగ్యంగా ఉండడం, లేక ఆ ఇంట్లో ఆడపెత్తనం ఉండడం జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే పడమర వైపు ఎత్తు చేసి తూర్పు దిశ పల్లంగా ఉంచితే సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటి యజమాని ఆరోగ్యవంతులవుతారు.

 ఈశాన్యంలో మేడ మెట్లు, మేడ ఉంటే మరణాలకు అవకాశం

ఈశాన్యంలో మేడ మెట్లు, మేడ ఉంటే మరణాలకు అవకాశం


తూర్పు వీధి ఉన్న ఇంటికి ఈశాన్యంలో మేడ మెట్లు ఉన్నా, లేక ఈశాన్యం వైపు ఏదైనా భవనం ఉన్నా కుటుంబ సభ్యులు యాక్సిడెంట్ల పాలవుతారు. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈశాన్యం మూలలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టి రాదు. ఈశాన్యంలో మరుగుదొడ్లు ఉంటే ఇంట్లో వంశం నాశనం అవుతుంది. మానసిక వికలాంగులైన పిల్లలు పుడతారు. కుటుంబ కలహాలు చోటుచేసుకుంటాయి. చెడు ప్రవర్తన కలిగిన సంతతి పుట్టే తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈశాన్యంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మరుగుదొడ్లను నిర్మించరాదు.

 తూర్పున తక్కువ ఖాళీ స్థలం, పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే పిల్లలపై ప్రభావం

తూర్పున తక్కువ ఖాళీ స్థలం, పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే పిల్లలపై ప్రభావం


తూర్పు వీధి గల ఇంటికి తూర్పువైపున తక్కువ ఖాళీ స్థలము పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇంట్లో మగ సంగతి లేకుండా పోతారు, ఒకవేళ ఉన్నా అప్రయోజకులు అవుతారు. కుటుంబంలో ఆడ సంతతి పెరిగి పోతారు. కాబట్టి తూర్పు వీధి గల ఇంటికి తూర్పువైపున ఎక్కువ ఖాళీ స్థలం, పడమర తక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు . తూర్పు వీధి గల ఇంటికి ఈశాన్య మూలలో చెత్తాచెదారం, ఇనుప వస్తువులు, నిరుపయోగమైన వస్తువులు పెట్టకూడదు. ఒకవేళ ఇలా ఈశాన్య మూలలో భారం పెడితే ఆ కుటుంబ యజమాని పై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతుంది.

 తూర్పు దిశను హద్దు చేసిన ఇల్లు మంచిది కాదు

తూర్పు దిశను హద్దు చేసిన ఇల్లు మంచిది కాదు


తూర్పు వీధి గల ఇంట్లో ఈశాన్యం వైపు చెట్లు పెడితే కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. తూర్పు వీధి గల ఇంటికి ఈశాన్యం వైపు చెట్లు పెంచడానికి నివారించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆడవారి పైన తూర్పు వీధి గల ఇంటికి ఆగ్నేయం వైపు ద్వారం ఉంటే అది ఆడవారి పై, రెండవ సంతతి పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తూర్పు దిశను హద్దుగా చేసి నిర్మించిన గృహంలో వంశం లేకుండా పోవచ్చును. కంటి వ్యాధులు రావచ్చు . అలాంటి ఇంట్లో నివసించుట ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు అని వాస్తు శాస్త్రం చెబుతుంది.

English summary
If there are any vastu defects in the house on East facing house, we have to face many problems. Try these remedies if there are any vastu defects .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X