vastu tips: మన జీవితంపై సూర్యుడి ప్రభావం; చాలా రోగాలకు శాశ్వతపరిష్కారం సూర్యనమస్కారం; ఎందుకంటే!!
మానవ జీవితంపై సూర్యభగవానుడి ప్రభావం ఎంతగానో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు మన శరీరం మీద పడకపోతే కచ్చితంగా అనారోగ్యం బారిన పడతామని అటు జ్యోతిష శాస్త్రం లోనూ, వైద్య శాస్త్రంలోనూ నిరూపించబడింది. అందుకే మన జీవితంలో మొట్టమొదట నమస్కరించ వలసిన భగవంతుడు ఎవరైనా ఉంటే ఆయన సూర్యభగవానుడేనని చెప్తారు.

సూర్యుడే మొదటి భగవంతుడు.. ఆయన దయ ఉంటేనే ఆరోగ్యం, ఆనందం
ఇటు వాస్తు శాస్త్రంలోనూ సూర్య కిరణాలు పడే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. సూర్యకిరణాలు పడకుండా చీకటిగా ఉండే ఇంట్లో ఉండేవారు అనారోగ్యంతో ఇబ్బందులు పడతారని చెప్పబడింది. అందుకే వాస్తు శాస్త్రంలోనూ సూర్యకాంతి ఇంట్లోకి వచ్చేలా నిర్మాణాలు చెయ్యాలని సూచించారు. కాబట్టి మన జీవితం పై సూర్యుని ప్రభావాన్ని గుర్తించి ఆయన ప్రసాదించే ప్రాణశక్తిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అసలు ఇంతకీ గ్రహాలలో సూర్యుడి పాత్ర ఏంటి? సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన దయ మన పై ఉండడానికి చేయవలసిందేంటి ఇక్కడ తెలుసుకుందాం

గ్రహాలకు రాజు సూర్యుడే..ఆయనను పూజిస్తే కలిగే లాభాలివే
నవ గ్రహాలలో మొదటివాడు , గ్రహ రాజు సూర్యుడు. గ్రహాలలో సూర్యుడు నారాయణ స్వరూపుడు గూడా. ఆయనను పూజిస్తే ఇతర గ్రహాలనూ పూజించినట్టే అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆయన అన్ని గ్రహాలకు రాజు కాబట్టి ఆయనను పూజిస్తే ఆరోగ్యం ,ఐశ్వర్యం, జ్ఞానం కలుగుతాయని చెప్తారు. మరి ఆయనను పూజించడానికి సూర్యనమస్కారాలు సరైన మార్గమని చెబుతున్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ శ్లోకంలోనూ నవ గ్రహాలలో మొదట సూర్యుణ్ణే స్మరిస్తాము. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్... అని కూడా చెబుతుంటారు. అంటే ఆరోగ్యం కలగాలంటే సూర్యుడి వల్లనే అది లభ్యమౌతుంది.

చేతులు జోడించి సూర్య భగవానుని ఉదయం పూజిస్తే అన్నీ మంచి ఫలితాలే
ఇక భగవంతుని ఏ విధంగా అయితే పూజిస్తామో.. సూర్యుని కూడా అదేవిధంగా రెండు చేతులు జోడించి పూజించాలి. సూర్యుడు వెలుగు లేకపోతే మానవ భూమి పై ఏ జీవి మనుగడ ఉండదు కాబట్టి, సూర్య భగవానుడు మనకిస్తున్న శక్తికి కృతజ్ఞతగా సూర్యుడికి నమస్కరించ వలసిన అవసరం ఉంది.
ప్రతిరోజు నిత్యం ఉదయం సమయంలో తూర్పు వైపు నిలబడి సూర్యభగవానుడికి చేతులు జోడించి నమస్కరించడం ఒక విధానం అయితే, యోగ ద్వారా సూర్య నమస్కారం చేయడం, ఆయన దయ మన పై ఉండాలని కోరుకోవడం మరొక విధానం. అలా ఆయనను పూజిస్తే అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయని చెప్తారు.

ఉదయాన్నే సూర్య నమస్కారాలు.. ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా అందులో 12 నమస్కారాలు ఉంటాయి. 12 నమస్కారాలు పూర్తి చేసినట్లయితే ఒక ఆవృతం పూర్తి అయినట్లు లెక్క. ఇక సూర్యనమస్కారాల లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. సూర్యనమస్కారం చేసే ఆసనాలతో శరీర సమతుల్యత ను సాధించవచ్చు.
శ్వాసకోశ వ్యవస్థ మెరుగవుతుంది. వెన్నెముక మెడ భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. సూర్యనమస్కారాలతో జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతం అవుతాయి. సూర్య నమస్కారాలు మన శరీరంలో రక్తప్రసరణను పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి.

మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే సూర్యుడే కనికరించాలి .. లేదంటే ఆస్పత్రి పాలే!!
గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి.సూర్య నమస్కారాలు వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. అధిక బరువు తగ్గడం, జీర్ణప్రక్రియ పెరగడంతోపాటు, మానసిక వత్తిడిని తగ్గించి ప్రశాంతతను చేకూరుస్తాయి సూర్య నమస్కారాలు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే మనపై ఖచ్చితంగా సూర్యభగవానుడి దయ ఉండాల్సిందే. ఆయన దయ లేకుంటే అనారోగ్యంతో ఆసుపత్రుల పాలు కావాల్సిందే.












Click it and Unblock the Notifications