Exit Poll 2026: 5 రాష్ట్రాల్లో విజేతలపై చాణక్య ఎగ్జిట్ పోల్-సంచలన ఫలితాలు ఖాయం?

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై యాక్సిస్ మై ఇండియా-టుడేస్ చాణక్య సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ (Exit poll 2026) ఫలితాలను ఇవాళ విడుదల చేసారు. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఈ ఎగ్జిట్ పోల్ వివరంగా వెల్లడించింది.

ముందుగా తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఈసారి డీఎంకే కూటమి అత్యధికంగా 39 శాతం ఓట్లతో 125 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని యాక్సిస్ మై ఇండియా-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ తెలిపింది. అన్నా డీఎంకే కూటమి కేవలం 27 శాతం ఓట్ల శాతంతో 45 సీట్లు మాత్రమే సాధిస్తున్నట్లు తెలిపింది. విజయ్ పార్టీ టీవీకే 30 శాతం ఓట్లు సాధించి 63 సీట్లు కైవసం చేసుకోబోతున్నట్లు టుడేస్ చాణక్య వెల్లడించింది.

Exit Poll 2026 Live Axis MyIndia and Today s Chanakya Predictions for Bengal Tamil Nadu and Assam

కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష యూడీఎఫ్ 40 శాతం ఓట్లతో 69 సీట్లు గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు యాక్సిస్ మై ఇండియా-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ తెలిపింది. అలాగే అధికార ఎల్డీఎఫ్ 38 శాతం ఓట్లు సాధిస్తున్నా 64 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది. బీజేపీకి 20 శాతం ఓట్లు, 7 సీట్లు రాబోతున్నట్లు టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ తెలిపింది. అంటే ఈసారి కేరళలో అధికార మార్పిడి తప్పదని తేల్చేసింది.

అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా అధికార బీజేపీ హవా కొనసాగుతుందని యాక్సిస్ మై ఇండియా-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. బీజేపీకి ఈసారి 50 శాతం ఓట్లతో 102 సీట్లు లభిస్తాయని తెలిపింది. విపక్ష కాంగ్రెస్ కు 38 శాతం ఓట్లు, 23 సీట్లు రాబోతున్నట్లు అంచనా వేసింది. ఇతరులకు 12 శాతం ఓట్లు, ఒక సీటు లభిస్తుందని టుడేస్ చాణక్య పోల్ లో తేలిపోయింది.

పశ్చిమబెంగాల్లోని 294 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 48 శాతం ఓట్లు సాధించి 192 సీట్లు కైవసం చేసుకోబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ తెలిపింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 38 శాతం మాత్రమే ఓట్లు సాధించి 100 సీట్లకే పరిమితం అవుతున్నట్లు తేలింది. ఇతరులు 14 శాతం ఓట్లు సాధించి మిగిలిన 2 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. దీంతో బెంగాల్లోనూ అధికార మార్పు తప్పదని తేలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+