వైసీపీకి దక్కేది ఈ ఒక్క జిల్లా జెడ్పీ పీఠం, లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్..!!
స్థానిక ఎన్నికల్లో కూటమి ఆధిక్యత కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం దక్కించుకున్న కూటమి పార్టీలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాయి. మొత్తం 28 జెడ్పీ పీఠాల్లో కూటమికి 27 దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకే ఒక్క జెడ్పీ పీఠం వైసీపీకి దక్కనుంది. మున్సిపల్ కార్పోరేషన్లలోనూ అనంతపురం మాత్రమే వైసీపీకి దక్కంది. చివరి నిమిషంలో ఇప్పుడు అక్కడ జరుగుతున్న రాజకీయం ఆసక్తిగా మారుతోంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి. జెడ్పీటీసీల్లో రాష్ట్రం లోని మొత్తం 659లలో ఏకగ్రీవాలతో కలిపి దాదాపు 580 స్థానాలు కూటమి పరమయ్యాయి. వైసీపీ 61 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక... 9821 ఎంపీటీసీ స్థానాలకుగాను 2051 స్థానాలు ఏకగ్రీవం కాగా...7767 స్థానాల్లో పోలింగ్ జరిగింది. అందులో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు వైసీపీ 1607 ఎంపీటీసీలను దక్కిచుకుంది. జగన్ సొంత జిల్లా కడపలో 39 జడ్పీటీసీ స్థానాలకుగాను 37స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. వీటిలో పోలింగ్‌కు ముం దే 23 ఏకగ్రీవం కాగా... ఎన్నికలు జరిగిన మరో 14 స్థానాలను కూటమి అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. పులివెందులలోని వేముల, వేంపల్లి జెడ్పీటీసీలను వైసీపీ గెలుచుకుంది.

వైసీపీకి ఒక కార్పోరేషన్.. ఒక జెడ్పీ పీఠం
కాగా, మొత్తం 28 జెడ్పీ ఛైర్మన్లలో ఇప్పుడు వచ్చిన ఫలితాలతో 27 కూటమికి దక్కనున్నాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా జెడ్పీ పీఠం వైసీపీకి ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ఆరు గెలిచింది. టీడీపీ మూడు, సీపీఎం ఒక చోట గెలుపొందాయి. అనంతగిరి, పెద బయలు, చింతపల్లి, జీకే వీధి, డుంబ్రిగుడ జెడ్పీటీసీలను వైసీపీ దక్కించుకుంది. హుకుంపేటలో వైపీపీ ఆధిక్యత కొనసాగుతోంది. ఇది కూడా గెలిస్తే జెడ్పీ పీఠం వైసీపీకి దక్కినట్లే. అదే విధంగా స్థానిక ఎంపీ, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు వైసీపీ వారే కావటంతో ఎక్స్ అఫీషియో ఓట్లతో జెడ్పీ స్థానం వైసీపీకి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా ఇదే జిల్లాలోని ఆరు ఎంపీపీలు సైతం వైసీపీకి దక్కనున్నాయి. గిరిజన ప్రాంతంలో ఓట్ల కోసం కూటమి నేతలు ప్రయత్నాలు చేసినా.. .ఇక్కడ ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపారు. దీంతో.. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒక జెడ్పీ.. ఒక మున్సిపల్ కార్పోరేషన్ కు పరిమితం కానుంది.













Click it and Unblock the Notifications
