ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా గుడ్ బై

ఐపీఎల్ లో ఓ కీలక ట్రేడింగ్ కాంట్రాక్ట్ ఖరారైంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడాడు. పంజాబ్ కింగ్స్ లో జాయిన్ అయ్యాడు. ఇప్పటిదాకా వెల్లువెత్తిన ఊహాగానాలకు తెరదించాడు. కోల్ కత నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఫ్రాంఛైజీల్లో చేరొచ్చంటూ ప్రచారం జరిగినప్పటికీ.. చివరికి పంజాబ్ కింగ్స్ ఖరారు చేసుకున్నాడు. స్వాపింగ్ పద్ధతిన అతను పీబీకేఎస్ లో చేరాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

పంజాబ్ కింగ్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. ఇరు ఫ్రాంచైజీల యాజమాన్యాల మధ్య ఈ ఒప్పందం పూర్తయింది. దీనికి బీసీసీఐ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేప్టెన్సీలో ఆడటానికి హార్దిక్ పాండ్యా పూర్తి సుముఖత వ్యక్తం చేసినట్టయింది. పంజాబ్ కింగ్స్ లో అర్ష్ దీప్ సింగ్ సుదీర్ఘకాలంగా కీలక బౌలర్‌గా వ్యవహరిస్తోన్నప్పటికీ.. ఆ జట్టు హెడ్ కోచ్, కెప్టెన్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం మేరకే ఈ మార్పిడి జరిగింది.

Hardik Pandya has been traded to Punjab Kings in exchange for pacer Arshdeep Singh to Mumbai Indians

ఈ ట్రేడింగ్ తో ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యాకు ఉన్న అనుబంధానికి తెరపడింది. 2024 సీజన్‌లో రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్ పాండ్యా ఆ జట్టును విజయవంతంగా నడిపించడంలో విఫలం అయ్యాడు. రోహిత్ స్థానంలో కేప్టెన్సీ పగ్గాలు అందుకోవడం కూడా అప్పట్లో విమర్శలకు దారి తీసింది. హార్దిక్ సారథ్యంలో ముంబై ఆశించిన ఫలితాలను సాధించలేదు. ప్లేఆఫ్స్ రేసులో వెనకపడింది. అతని కేప్టెన్సీలో ఆడిన రెండు సీజన్లలోనూ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో నిలవాల్సొచ్చింది ముంబై ఇండియన్స్ కు.

నెతన్యాహు అవుట్: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా: రాత్రికి రాత్రి.. !!
నెతన్యాహు అవుట్: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా: రాత్రికి రాత్రి.. !!

మరోవైపు అర్ష్ దీప్ సింగ్ చేరిక ముంబై ఇండియన్స్ పేస్ బౌలింగ్ విభాగానికి కొండంత బలాన్ని ఇవ్వనుంది. పంజాబ్ కింగ్స్ తరఫున సుదీర్ఘకాలం పాటు నిలకడగా రాణించిన ఈ స్పీడ్ స్టర్.. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయిదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ తమ ప్రధాన బౌలింగ్ బలహీనతలను అధిగమించడానికి ఈ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌ను ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

టీటీడీలో మరో కీలక నియామకం
టీటీడీలో మరో కీలక నియామకం

పంజాబ్ కింగ్స్ గత సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 2014 తర్వాత మొదటిసారిగా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. రాబోయే సీజన్‌లో కూడా శ్రేయస్ కెప్టెన్‌గా కొనసాగనుండగా హార్దిక్ పాండ్యా ప్లేయర్ గా మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటాడు. మిడిలార్డర్‌లో వేగంగా పరుగులు సాధించడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీయగల హార్దిక్ రాక పంజాబ్ జట్టు బ్యాలెన్స్, మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం లేకపోలేదు.

ఈ భారీ ట్రేడింగ్ ఇరు జట్ల స్వరూపాన్ని గణనీయంగా మార్చనుంది. అర్ష్ దీప్ సింగ్ తో ముంబై ఇండియన్స్ తన బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోగా.. అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాకతో బ్యాటింగ్, బౌలింగ్ ను పటిష్టం చేసుకుంది.. చుకోగా, పంజాబ్ కింగ్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+