Tamil Nadu Exit Poll: అన్నాడీఎంకేను మూడో స్ధానానికి నెట్టేసిన విజయ్-టుడేస్ చాణక్య పోల్..!

తమిళనాడు (Tamil Nadu)లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. నిన్న విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ లో తమిళనాడులో ఈసారి డీఎంకే కూటమి అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అయితే విజయ్ పార్టీ టీవీకే మాత్రం ఫలితాలను చాలా చోట్ల తారుమారు చేసినట్లు అర్థమవుతోంది. విజయ్ పార్టీ దెబ్బకు విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కుదేలైనట్లు ఇవాళ విడుదలైన మై యాక్సెస్ ఇండియా-టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ తేల్చింది.

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై మై యాక్సెస్ ఇండియా-టుడేస్ చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకరోజు ఆలస్యంగా విడుదల చేశారు. ఇందులో అధికార డీఎంకే మరోసారి 125 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోయింది. అయితే రెండో స్ధానం కోసం జరిగిన పోరులో అన్నాడీఎంకేను విజయ్ కొత్త పార్టీ టీవీకే అధిగమించింది. అన్నాడీఎంకే కూటమి కంటే విజయ్ పార్టీ టీవీకే ఎక్కువ సీట్లు సాధించబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ తేల్చింది.

Tamil Nadu Vijay s TVK Set to Outperform AIADMK in Chanakya s Latest Exit Poll

ఎగ్జిట్ పోల్ ప్రకారం అన్నాడీఎంకే 27 శాతం ఓట్లతో 45 సీట్లు సాధించబోతున్నట్లు తేలింది. అయితే కొత్తగా వచ్చిన టీవీకే మాత్రం 30 శాతం ఓట్లు సాధించి 63 సీట్లను కైవసం చేసుకోబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ తేల్చింది. దీంతో రెండో స్ధానంలో విజయ్ పార్టీ టీవీకే ఉండబోతున్నట్లు నిర్ధారణ అయింది. మొన్నటివరకూ వెలువడిన పలు అంచనాల్లో విజయ్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చెప్పగా.. నిన్న ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం విజయ్ పార్టీ భారీగా ఓట్లు చీల్చి సీట్లు కైవసం చేసుకుంటున్నట్లు తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+