అయోధ్యలో దీపోత్సవ వైభవం.. సరయూ నది తీరంలో 30 లక్షలకు పైగా దీపకాంతులతో..

దీపావళి పర్వదినం సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ లోని పవిత్రమైన ఆధ్యాత్మిక నగరం అయోధ్య దీపాల కాంతులతో వెలిగిపోయింది. సరయూ నదీ తీరాన ఉన్న 56 ఘాట్లలో ఏకంగా 30 లక్షలకుపైగా దీపాలను వెలిగించి.. అత్యంత వైభవంగా 10 వ దీపోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ దీపోత్సవరం కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ఉత్తర్ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ పాల్గొన్నారు. ఇక సరయూ నది తీరమంతా దీపకాంతులతో నిండిపోవడంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్ముతోంది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. ఈ క్రమంలో అయోధ్యలో సందడి నెలకొంది.

ఇక ఈ దీపోత్సవం వేడుకలో లేజర్, డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 2 వేలకు పైగా స్వదేశీ డ్రోన్ల ప్రదర్శన మంత్రముగ్దుల్ని చేసింది. ఈ డ్రోన్ లు ప్రత్యేకమైన ఆకృతుల్లో కదులుతూ రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరించాయి. ఈ లేజర్, డ్రోన్ షోలను తిలకించేందుకు దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఘాట్‌ ల వద్దకు తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రొజెక్షన్ మ్యాపింగ్, సంగీత బాణాసంచా ప్రదర్శనలకు సంబంధించిన వేడుకలకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Ayodhya Deepotsav latest with over 3 million lamps illuminating the banks of the Sarayu River

అంతకుముందు సాకేత్‌ కాలేజీ నుంచి ఉదయం ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేక శోభాయాత్ర దాదాపు మూడు కిలోమీటర్ల వరకు సాగింది. దారిపొడవునా జై శ్రీరామ్‌ నినాదాలు మార్మోగాయి. శోభాయాత్ర రామ్‌ కథా పార్క్‌ కు చేరుకుంది. అనంతరం దాదాపు 14 రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు రామాయణంలోని ఏడు కాండాల ఇతివృత్తంతో రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+