మిలిటరీ దుస్తుల్లో వచ్చి కాల్పులు.. ఆరుగురు మృతి.. 15 మందికి సీరియస్

పోలాండ్‌ లోని క్రాకోవ్‌ నగరంలో ఓ దుండగుడు భీకర కాల్పులకు తెగబడ్డాడు. శనివారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాన మార్కెట్‌ స్క్వేర్‌ సమీపంలో కారులో వచ్చిన ఓ గుర్తు తెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇక కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిపై కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో గాయపడ్డ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో పర్యటకులు.. స్థానికులు ఘటనాస్థలికి దూరంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. ఇక ఈ ఘటనపై కటార్జినా సిస్లో అనే స్థానిక పోలీస్ అధికారి మాట్లాడుతూ.. షూటర్ మిలిటరీ లాంటి దుస్తులను ధరించాడని అలాగే ఈ దాడులకు మిలిటరీ ఆయుధాలను కూడా వినియోగించాడని పేర్కొన్నారు. అలాగే ఈ దాడి సమయంలో అతడి వాహనంలో మరిన్ని ఆయుధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడని తెలిపారు. అయితే నిందితుడు ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉన్నాడని.. అతనికి స్పృహ వచ్చాక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

Poland shooting Violent shooting in Poland six dead 15 in serious condition latest poland news

మరోవైపు ఈ ఘటనపై పోలాండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ స్పందించారు. కాల్పులకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని వివరించారు. నిందితుడు ఇలాంటి ఘటనకు పాల్పడటానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు సాహసోపేతంగా పోరాడి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారని ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకూ బుల్లెట్ గాయాలు తగిలాయని అన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు చూపిన తెగువను పోలాండ్ ప్రధాని ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+