అది నా ఫేవరెట్ జట్టే.. కానీ నాకు నమ్మకం లేదు దొర!

ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటతీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై టీమ్ వరుస వైఫల్యాలను చవిచూస్తుండటంతో.. ఆ జట్టుపై తనకు ఎలాంటి నమ్మకం లేదని అశ్విన్ స్పష్టం చేశాడు. 8 మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై పరిస్థితి చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని రవిచంద్రన్ అశ్విన్ వాపోయాడు.

ముఖ్యంగా ఏప్రిల్ 29న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ.. దానిని కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు విఫలం కావడం రవిచంద్రన్ అశ్విన్‌ను విస్మయానికి గురిచేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో జర్నలిస్ట్ విమల్ తివారీతో మాట్లాడుతూ.. "ముంబై జట్టు ఇలా ఆడుతుంటే నా మెదడు అస్సలు పనిచేయడం లేదు. అసలు ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు. టోర్నీ ప్రారంభానికి ముందు నా ఫేవరెట్ టీమ్ ఇదే. కానీ ఇప్పుడు వారి పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోంది" అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

IPL 2026 R Ashwin Gives Up on Hardik Pandya Mumbai Indians Says No Faith Left After SRH Defeat

ముంబై జట్టు తిరిగి పుంజుకుంటుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ రవిచంద్రన్ అశ్విన్ నిరాశ వ్యక్తం చేశాడు. "నాకు అస్సలు ఆశ లేదు. ఎందుకంటే వారి బౌలింగ్ ట్రెండ్ గమనించండి.. కేకేఆర్ మీద 220 పరుగులు ఇచ్చారు, వేరే ఏ జట్టూ కేకేఆర్ మీద అన్ని పరుగులు ఇవ్వలేదు. ముంబై మొదట బౌలింగ్ చేస్తే 230-240 పరుగులు సమర్పించుకుంటున్నారు. బ్యాటింగ్ లైనప్ కూడా తడపడుతోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండూ విఫలమవుతుంటే విజయాలు ఎక్కడి నుంచి వస్తాయి?" అని రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు.

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు మళ్లీ పుంజుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే. గత సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి కూడా ప్లేఆఫ్స్‌కు చేరిన చరిత్ర ముంబైకి ఉన్నప్పటికీ.. ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మే 2న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్ ముంబై భవిష్యత్తును నిర్ణయించనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే, ఐపీఎల్ 2026లో ముంబై ప్రయాణం దాదాపు ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+