శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకమైన నెలగా చెప్పవచ్చు . ఏప్రిల్ మాసంలో ముఖ్య గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారికి పైన ప్రభావం చూపిస్తాయి. ఈ సమయంలో జరిగే గ్రహ సంచారాలు మనుషుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి.
మేష,వృషభ రాశులలో శుక్ర సంచారం
ఏప్రిల్ 2026లో శుక్రుడు ఏప్రిల్ 19 వరకు మేషరాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో ఏప్రిల్ 21 నుండి శుక్రుడు వృషభరాశిలో వక్రగమనం చేయనున్నాడు. దీనివల్ల ముఖ్యంగా వృషభ, మేష, తులా, కర్కాటక రాశుల వారికి వైవాహిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

శుక్ర సంచారంతో ప్రతికూలతలు పొందే రాశులు
ముఖ్యంగా, సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అదే బలహీనంగా ఉంటే కొన్ని రాశుల వారి పైన తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏప్రిల్ మాసంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారు ప్రతికూలతలను చూస్తున్నారు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి జాతకులకు శుక్రుడు ప్రతికూల ఫలితాలను ఇవ్వనున్నాడు. శుక్రుని సంచారం వల్ల కొన్నిసార్లు కుటుంబ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి
వృషభ రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో కష్టాలను చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో వృషభరాశి జాతకులు ఆర్ధికంగా చిరాకులు చూస్తారు. ఎప్పటి నుండో వసూలు కాని బాకీలు చిరాకు కలిగిస్తాయి. ఏ పని చేసినా వృషభరాశి వారు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి.
తులారాశి
తులా రాశి జాతకులకు ఏప్రిల్ మాసంలో కష్టాలు రాబోతున్నాయి. ఈ మాసం వీరికి ఆర్థిక నష్టాలను సూచిస్తుంది. తులారాశి జాతకులు తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏ పని చేసిన నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పాత భూముల విలువలు తగ్గడంతో మానసిక ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు విషయంలో తులా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు. శుక్రుడు మీ ప్రయత్నాలకు అడ్డుగా ఉండి అనేక ఇబ్బందులను కలిగిస్తాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి తీవ్ర నష్టాలు వస్తాయి. సామాజికంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేసేవారు ఆ ప్రణాళికలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications