మార్చి నెలలో శుక్రుడి దయతో వీరికి లక్ష్మీ కటాక్షం.. సంపన్న యోగం!
నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. రాక్షసులకు గురువుగా చెప్పే శుక్రుడు సంపద, శ్రేయస్సులకు, విలాసాలకు, అందానికి, ప్రేమకు ప్రతీక. అలాంటి ప్రాధాన్యత ఉన్న శుక్ర గ్రహం ఈ ఏడాది మార్చి 15వ తేదీన బుధుడు అధిపతిగా ఉండే రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది.
రేవతి నక్షత్రంలో శుక్రుడు
ఈ నక్షత్రంలో శుక్రుడు సుమారు 13 నుంచి 14 రోజుల పాటు సంచరిస్తాడు, ఈ గ్రహ సంచారం ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్ధిక ప్రయోజనాలన, శుభ ఫలితాలను తీసుకురానుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి శుక్రుడు రేవతి నక్షత్ర సంచారంతో లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు శుక్రుడి నక్షత్ర మార్పు ఊహించని ఆర్ధిక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయం పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ప్రతీ పనిలోనూ వృషభ రాశి జాతకులు విజయం సాధిస్తారు.
మిధునరాశి
మిథున రాశి వారికి శుక్రుడి సంచారం బాగా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో వారు కెరీర్ పరంగా గొప్ప విజయాలు సాధించగలరు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాదాయంగా ఉంటుంది. వారి సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. శుక్రుడి అనుగ్రహంతో వారి బ్యాంకు బ్యాలెన్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కన్యా రాశి
కన్య రాశి వారికి శుక్రుడి నక్షత్ర మార్పు కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. విదేశాలలో ఉన్నవారికి అన్ని విధాలా బాగుంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూల సమయం. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు రావడం ఖాయం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఈ సమయంలో రుణ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వీరి ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో బాగుంటుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications