రేపటి నుంచి లక్ష్మీ యోగం.. ఈ రాశులవారి సుడి తిరిగినట్లే
శుక్రుడు మిథునరాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలోకి 30వ తేదీన సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సంచారమనేది 12 రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కొన్ని రాశులకు సానుకూలంగా ఉంటే మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. రేపటి నుంచి లక్ష్మీ యోగం ఏర్పడుతోంది. దీనివల్ల 5 రాశులవారికి సుడి తిరిగినట్లేనని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. శుక్రుడి సంచారం జ్యేష్ట మాసంలోని శుక్లపక్షం దశమి తిథిరోజు జరగబోతోంది. ఏయే రాశులవారికి కలిసిరానుందో చూద్దాం.
మేష రాశి:ఈ రాశివారికి జీవితం అంతా ఆనందకరంగా సాగిపోతుంది. శుక్రుడు సంచరించే సమయంలో వీరు ఎటువంటి పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు. అంతేకాకుండా వీరు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి: కర్కాటకరాశివారు అత్యధిక ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేయబోతున్నాడు. భవిష్యత్తులో వీరికి అనేక లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ లేదంటే ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు చేసేవారికి వారి శ్రమ ఫలితంగా కార్యాలయాల్లో గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారికి రోజులు సంతోషంగా సాగుతాయి.
సింహ రాశి: ఈరాశివారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కెరీర్ బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా ఏ విధమైన సమస్య తలెత్తినా చిటికలో పరిష్కరించేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి:వీరు ఏ పనిచేపట్టినా కలిసి వస్తుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ధన లాభం ఉంది. విద్యారంగంతో అనుబంధం ఉన్నవారు ప్రయోజనాలు పొందుతారు. విదేశాల్లో చదవాలనుకునేవారి కోరికలు నెరవేరతాయి.
మీన రాశి
వీరు ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో భారీగా లాభపడతారు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి.












Click it and Unblock the Notifications