వక్రమార్గం నుండి ప్రత్యక్షం కానున్న శుక్రుడు... వీరిదే విలాసాల దూకుడు!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడు సంపదలకు, విలాసాలకు అధిపతిగా చెబుతారు. అటువంటి విలాసాల అధిపతి శుక్రుడు మీనరాశిలో వక్రమార్గం నుండి ఏప్రిల్ లో ప్రత్యక్ష మార్గంలోకి ప్రయాణం సాగిస్తాడు. ప్రత్యక్ష మార్గంలో శుక్రుడు సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావం పడుతుంది.
శుక్ర సంచారంతో కలిసొచ్చే రాశులు
మీనరాశిలో మార్చి రెండవ తేదీ 2025న తిరోగమనములోకి వెళ్లిన శుక్రుడు తిరిగి ఏప్రిల్ 13 2025న ప్రత్యక్ష మార్గంలోకి వస్తాడు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఈ పరిణామం కొన్ని రాశుల పైన శుభ ప్రభావాలను, అశుభ ప్రభావాలను చూపుతుంది. శుక్రుడి ప్రత్యక్ష సంచారం కారణంగా కొన్ని రాశులవారు తిరుగులేని ఫలితాలను సాధిస్తారు. శుక్ర సంచారంతో కలిసి వచ్చే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి శుక్రుని ప్రత్యక్ష సంచారం లాభదాయకంగా ఉంటుంది. శుక్రుడు మిధున రాశిలో ప్రత్యక్ష మార్గంలో సంచరించే సమయంలో వారి ఆదాయంలో పెరుగుదల వస్తుంది. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులకు అవకాశం ఉంది. వ్యాపారస్థితి బలపడుతుంది.
కన్యారాశి
కన్యా రాశి వారికి శుక్రుని ప్రత్యక్ష సంచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శుక్రుడు కన్యారాశిలో ఏడవ గృహంలో నేరుగా సంచరిస్తాడు. దీనివల్ల కన్యా రాశి వారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. వ్యాపార పరంగా విజయం సాధిస్తారు. కన్యారాశి జాతకులు శుభవార్తలు వింటారు.
కుంభరాశి
శుక్రుని ప్రత్యక్ష సంచారం కుంభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. కుంభరాశిలో శుక్రుడు ధన మరియు వాక్ స్థానంలో నేరుగా సంచరిస్తాడు. దీని వల్ల కుంభ రాశి వారికి ఊహించని ధన లాభం కలుగుతుంది. కుంభ రాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి. పని ప్రదేశంలో మీ నైపుణ్యాలను ప్రదర్షించే అవకాశం ఉంటుంది. ఇది కుంభరాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications