వారఫలాలు: అవకాశాలను అదృష్టంగా మార్చుకోవాలి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి

గ్రహాలు నిర్ధేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. దీనివల్ల శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు.. రెండూ ఏర్పడతాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఈనెల 15వ తేదీ నుంచి 21వ తేదీవరకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏవైనా సమస్యలు ఏర్పడతాయా? వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి? అందుకు తగిన మార్గాలేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.

మేషరాశి : అనేక శుభ ఫలితాలున్నాయి. సమయాన్ని వృథా కానివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీవల్ల ఎక్కువ మంది లాభపడతారు. మిత్రుల సహకారంతో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. లక్ష్మీ దేవిని ధ్యానించాలి.

weeklya horoscope from october 15th to october 21st 2023

వృషభరాశి : పనితీరును బట్టి, సామర్థ్యాన్ని బట్టి విజయాలు ఆధారపడి ఉన్నాయి. ధర్మమార్గంలోనే లక్ష్యాలను చేరుకోవాలి. ఆర్థిక స్థితి బాగుంటుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. కుటుంబ సభ్యల నుంచి సహకారం అందడంతో సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఇష్టదైవాన్ని స్మరించాలి. దీనివల్ల మనోబలం లభిస్తుంది.

మిథున రాశి : వ్యాపారం కలిసివస్తుంది. పనులన్నీ సకాలంలోనే పూర్తవుతాయి. భూమి, వాహన యోగాలున్నాయి. చెడును కలలో కూడా తలచవద్దు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానమైన విషయాలను ఇతరులతో చర్చించవద్దు. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల మేలు కలుగుతుంది.

సింహరాశి : ప్రయత్నాలు గట్టిగా చేయాలి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. ప్రతి పనిలో మీదే పైచేయి అవుతుంది. నిర్ణయాలు ఆత్మవిశ్వాసంతో తీసుకోవాలి. ఇంటికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. లక్ష్మీ దేవిని ధ్యానించడంవల్ల శుభ ఫలితాలున్నాయి.

కన్యా రాశి : విజయం సాధించాలంటే పట్టుదలగా పనిచేయాలి. గ్రహ దోషం వల్ల విఘ్నాలు అడుగడుగునా ఎదురవుతాయి. సొంత నిర్ణయాలే విజయాన్ని సాధించిపెడతాయి. ఇతరులపై అసలు ఆధారపడొద్దు. ఎవరితోను ముక్కుసూటిగా పోవద్దు. ప్రయాణాల్లో సమస్యలున్నాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.

తులా రాశి :ఎవరితోను, ఎటువంటి పరిస్థితుల్లోను గొడవకు దిగొద్దు. పనులన్నింటినీ సకాలంలోనే పూర్తిచేయాలి. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. నలుగురికి ఆదర్శవంతంగా మీ ప్రవర్తన ఉంటుంది. వచ్చిన అవకాశాల్ని అదృష్టంగా మార్చుకోవాలి. సూర్యనారాయణమూర్తిని దర్శించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+