వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడి ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే జీవితంలో ఏం జరుగుతుంది?

|
Google Oneindia TeluguNews

కొబ్బరికాయ.. హిందువులు అత్యంత పవిత్రంగా భగవంతుని పూజకు ఉపయోగించే కొబ్బరికాయ సంస్కృతిలో ఒక భాగం. కొబ్బరికాయను టెంకాయ అని, నారికేళం అని వివిధ పేర్లతో పిలుస్తారు. భగవంతుని పూజలైనా, ఇంట్లో శుభకార్యాలైనా కొబ్బరికాయ లేనిదే పూర్తి కానేరవు. ఇక దేవుళ్లకు కొబ్బరికాయ కొట్టడం వెనుక మానవ జీవితంతో అనుబంధమైన ముఖ్యమైన విషయాలు ఉన్నాయని చాలామంది చెబుతూ ఉంటారు.

కొబ్బరి కాయలు దేవుడి ముందు కొట్టేది ఇందుకే

కొబ్బరి కాయలు దేవుడి ముందు కొట్టేది ఇందుకే

కొబ్బరికాయని భగవంతుడి ముందు కొట్టడం మనలో ఉన్న అహంకారాన్ని వినాశనం చేసి స్వచ్ఛంగా తెల్లగా భగవంతుని ముందు మన మనసును ఉంచడమేనని చెబుతారు. కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహానికి ప్రతీక అని దానిని పగల కొట్టి కొబ్బరి చిప్పలను భగవంతుని ముందు నివేదించడం వల్ల తెల్లనైన కొబ్బరిలా మన మనసును కూడా భగవంతుని ముందు పరిచినట్టుగా చెబుతారు. ఇక కొబ్బరి నీళ్లు శ్రేష్టమైనవి కావడంతో కొబ్బరినీరుల మన జీవితం కూడా నిర్మలం అవ్వాలని సూచనగా భగవంతుని ముందు కొబ్బరికాయను కొడతారని పెద్దలు చెప్తూ ఉంటారు.

మనిషి శరీరానికి కొబ్బరికాయకు సంబంధం

మనిషి శరీరానికి కొబ్బరికాయకు సంబంధం

భగవంతుని ముందు కొబ్బరికాయ కొట్టడం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. అనాదిగా మన పూర్వీకుల నుండి వచ్చిన ఆనవాయితీ. కొబ్బరికాయను మనిషితో పోల్చి కూడా చెబుతారు. కొబ్బరికాయ పైన ఉండే పీచును జుట్టుగా, కొబ్బరికాయని మనిషి శరీరం గా, అందులో ఉండే నీటిని మన రక్తం గా చెప్పి టెంకాయ కొట్టిన తర్వాత వచ్చే కొబ్బరిని మనసుగా భావించి భగవంతుని ముందు నివేదిస్తే మనసులో ఉన్న అన్ని రాగద్వేషాలు తొలగిపోతాయని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే భగవంతుని ముందు కొబ్బరికాయలను తప్పనిసరిగా కొడతారు.

కొబ్బరికాయలు కుళ్ళితే అరిష్టమా.. అశుభమా?

కొబ్బరికాయలు కుళ్ళితే అరిష్టమా.. అశుభమా?


ఇక కొబ్బరికాయలు కుళ్ళిపోతే అశుభం జరుగుతుందని చాలామంది భయపడతారు. అయితే ధర్మ శాస్త్ర పండితులు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్మలమైన మనసుతో కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని తిరిగి పూజను కొనసాగించవచ్చునని చెబుతున్నారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని భయాందోళనకు గురయ్యే వారు అది కేవలం అపోహ మాత్రమేనని గుర్తించాలని చెబుతున్నారు.

కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టమా?

కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టమా?

కొబ్బరికాయను కొనుగోలు చేసిన వారికి కొబ్బరికాయ బాగా ఉందా లేదా అన్న అవగాహన లేకపోవడం వల్ల జరిగిన తప్పిదం మాత్రమేనని, దానితో జరిగే నష్టమేమీ లేదని చెబుతున్నారు. భగవంతునికి నిష్టగా, మనస్ఫూర్తిగా నమస్కరించి కొబ్బరికాయ కొడితే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. ఇక చాలామంది కొబ్బరికాయ సమంగా పగిలితే కోరుకున్న కోరిక నెరవేరుతుందని భావిస్తూ ఉంటారు. కొబ్బరికాయలో పువ్వు వస్తే అదృష్టం కలిసి వస్తుందని శుభసూచకమని నమ్ముతారు. మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వస్తే సంతానం కలుగుతుందని బలంగా నమ్ముతారు.

కొబ్బరికాయ విషయంలో ముందే జాగ్రత్త

కొబ్బరికాయ విషయంలో ముందే జాగ్రత్త


అయితే ఇవన్నీ కేవలం విశ్వాసాలు మాత్రమే. ఇందులో ఎటువంటి శాస్త్రీయత లేదు. ఏ శాస్త్రాల్లోనూ కొబ్బరికాయకి సంబంధించి కుళ్ళితే అరిష్టం, పువ్వు వస్తే అదృష్టం అని చెప్పిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి భగవంతుని ముందు కొట్టే కొబ్బరికాయ గురించి ఎక్కువ ఆలోచించకుండా భగవంతునిపైన మనసును లగ్నం చేసి దేవునికి కొబ్బరికాయను కొట్టి నివేదించండి. ఒకవేళ మనసులో పీకులాట ఉన్నవారు కొబ్బరికాయలు కొనుగోలు చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకుని కొనుగోలు చేయండి.

English summary
Is it inauspicious if a rot coconut break in front of God? Is a flower in coconut is lucky? What does the dharma shastra say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X