• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శని త్రయోదశి - ఏమి చేస్తే దేవుడు సంతృప్తి చెందుతాడు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

శ్లోకం:-
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరమ్

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శనిక్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురిచేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.

శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశికి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.

What is shanitrayodashi, What to do to satisfy Shani God-Know here

శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.

శని త్రయోదశి అంటే :- శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతోను, నువ్వుల నూనేతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.

శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని, వస్త్ర, ధన, వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.

త్రయోదశి వ్రతం:- శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త, పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద, పిప్పలా, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలవబడుతాడు.

నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.

* ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.

* ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు.

* వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.

* శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు

నీలాంజన సమభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం.

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.

* వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.

* అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.

* ఎవరితోను వాదనలకు దిగరాదు.

* ఆ రోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.

* ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

* గోమాతకు, మూగ జీవులకు ఆహార గ్రాసలను, నీటిని ఏర్పాటు చేయాలి.

* కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.

* అనాధలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఏదో రూపంగా సహయపడాలి.

* జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.

* ప్రతి రోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకోవాలి.

* అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.

* ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ

కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ

శుద్ధబుద్ధి ప్రదాయనే

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్

మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

* నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే

* ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.

English summary
According to Astrology Shani is the ruler on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X