మీనాక్షి నటరాజన్ పిటీషన్ పై సుప్రీం కీలక నిర్ణయం..!!
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఊరట దక్కలేదు. రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించా రంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. నామినేషన్ తిరస్కరణపై తాము నేరుగా జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేసారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె ఎలక్షన్ పిటిషన్ ద్వారా న్యాయపోరాటం చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అటు కాంగ్రెస్ ఈ వ్యవహారంలో తమ కార్యాచరణకు సమాయత్తం అవుతోంది.
కాంగ్రెస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి.. హైదరాబాద్ కోర్టులో తనపై ఉన్న ఒక ప్రైవేట్ కేసు వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదని, నిజాలను దాచారంటూ బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఒక కాంగ్రెస్ నేతపై వచ్చిన వేధింపుల ఫిర్యాదుపై.. ఇంచార్జ్ మీనాక్షి తగిన చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, అందులో మీనాక్షికి నోటీసులు వచ్చాయి. ఈ వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనకపోవడం నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంటూ రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ వ్యవహారం పైన మీనాక్షీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట దక్కలేదు. రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించా రంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు.. కాంగ్రెస్ భవిష్యత్ నిర్ణయం
మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ కోరారు. "కేవలం ఒక ప్రైవేట్ కంప్లైంట్‌లో కోర్టు నోటీసు మాత్రమే ఇచ్చింది. ఆ కేసును కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు, చార్జ్‌షీట్ కూడా దాఖలు కాలేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉండి, కోర్టు చార్జ్ ఫ్రేమ్ చేస్తేనే అఫిడవిట్‌లో చెప్పాలి. కాబట్టి ఆర్వో నిర్ణయం పూర్తిగా ఏకపక్షం" అని సింఘ్వి వాదించారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం ఎన్నికల ప్రక్రియ మధ్యలో కోర్టులు జోక్యం చేసుకోలేవని, ఫలితాల తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేయడమే ఏకైక మార్గమని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇక, మరో వైపు బీజేపీ పైన కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మీనాక్షి నామినేషన్ రద్దు కావడంతో మధ్యప్రదేశ్‌లో మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.













Click it and Unblock the Notifications