బ్రిటీషర్లు కూడా చేయని ద్రోహం, నిధులు లేవు..: షాకింగ్ నిజాలు చెప్పిన సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రజా ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి వేదికగా 'విజయోత్సవ సభ' అత్యంత వైభవంగా జరిగింది. "2 ఏళ్ల నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం" అనే నినాదంతో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదికపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి సభను అధికారికంగా ప్రారంభించారు. ఈ విజయగర్జన సభలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, సామాన్య ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్‌లతో కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దామంటూ ఇచ్చిన పిలుపును ప్రజలు నమ్మి 57 శాతం ఓట్ షేర్‌తో, 164 స్థానాల్లో కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని గుర్తుచేశారు. ఈ తీర్పును తాము కేవలం గెలుపుగా చూడటం లేదని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు తమ భుజాలపై పెట్టిన బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. తాము పాలకులము కాదని, ప్రజల సేవకులముగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu Addresses Alliance Government 2 Years Success Meet In Tirupati With Pawan Kalyan and Lokesh

గత ప్రభుత్వ విధ్వంసాలపై ధ్వజం

తాము అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో 'ప్రజావేదిక' కూల్చివేతతో మొదలైన గత ప్రభుత్వ విధ్వంసకర పాలన.. రాష్ట్రాన్ని రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టేసి ముగిసిందని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలను, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి, ఇన్వెస్టర్లను వేటాడి తరిమేశారని మండిపడ్డారు. నాడు ప్రశ్నించిన ప్రజలపై అక్రమ కేసులు పెట్టారని, తనను అక్రమంగా జైలుకు పంపి, పవన్ కల్యాణ్‌ను సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. ఆ దారుణ పరిస్థితుల్లోనూ తాము వెనకడుగు వేయకుండా ప్రజల కోసమే నిలబడ్డామని, ప్రభుత్వం మారాక ఏడు శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచామని వివరించారు.

డబుల్ ఇంజన్ సర్కార్‌తో గాడిలో పడ్డ వ్యవస్థలు

ప్రజలు చూపిన విజ్ఞత వల్లే రాష్ట్రంలో 'డబుల్ ఇంజన్ సర్కార్' అధికారంలోకి వచ్చిందని, తాము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కుప్పకూలిన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు మళ్లీ వర్ధిల్లుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంపూర్ణ అండగా నిలుస్తోందని కొనియాడారు. ఇదే తరుణంలో ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. వరుసగా మూడుసార్లు మోదీకి మద్దతు ఇవ్వడం వల్లే దేశం గ్లోబల్ రేంజ్‌లో దూసుకుపోతోందని, చంద్రయాన్, గగన్‌యాన్, ఆపరేషన్ సింధూర్ వంటి ప్రాజెక్టులు దేశ ప్రతిష్టను పెంచాయని కొనియాడారు.

ఏపీలో కూటమికి రెండేళ్ళు.. తిరుపతిలో భారీ సభ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ రిపోర్ట్!
ఏపీలో కూటమికి రెండేళ్ళు.. తిరుపతిలో భారీ సభ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ రిపోర్ట్!

హామీల అమలు-సంక్షేమ పథకాల జోరు

తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం 'సూపర్ సిక్స్' పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా రూ. 65 వేల కోట్ల పెన్షన్లు పంపిణీ చేశామని, తల్లికి వందనం, స్త్రీశక్తి ద్వారా మహిళలకు 71 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో కలిసి ప్రతి రైతుకూ రూ. 20 వేలు అందిస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. గీత కార్మికులు, వడ్డెరులు, అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్‌ల సంక్షేమాన్ని తాము మరవలేదన్నారు. నిరుద్యోగ యువత కోసం మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులు, 5757 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని, ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన రూ. 21 వేల కోట్ల బకాయిలను 23 నెలల్లోనే చెల్లించామని వివరించారు.

తాకట్టు పెట్టిన వారికి మాట్లాడే అర్హత లేదు

ఎమ్మార్వో ఆఫీసులు, ఆస్పత్రులు, చివరకు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన గత పాలకులకు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. యావత్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిన గొడ్డలి పార్టీకి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తిరుమల పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేసి కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేశారని, బ్రిటీషర్లు కూడా చేయని దుర్మార్గాన్ని వీరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు.

రైతులకు బంపర్ ఆఫర్.. రూ. వందకే వారసత్వ ఆస్తి బదిలీ!
రైతులకు బంపర్ ఆఫర్.. రూ. వందకే వారసత్వ ఆస్తి బదిలీ!

పారిశ్రామిక ప్రగతి.. రాయలసీమకు మహర్దశ

రాష్ట్రంలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ద్వారా పరిశ్రమలకు అత్యంత వేగంగా అనుమతులు ఇస్తూ ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించామని చంద్రబాబు వివరించారు. కేవలం 36 రోజుల్లోనే రాయలసీమలోని పుట్టపర్తికి 5వ జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. రాయలసీమను రూ. 1 లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్‌గా మార్చడంతో పాటు స్పేస్, డ్రోన్, డిఫెన్స్ పరిశ్రమలు తీసుకొస్తున్నామని చెప్పారు. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్స్ ఫ్యాక్టరీ వస్తోందని, కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గని తవ్వకాలు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు.

విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాలు వస్తుంటే, అమరావతికి క్వాంటం వ్యాలీ వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే, 100 రోజుల్లోనే హంద్రీనీవా పూర్తి చేసి కుప్పానికి నీళ్లు ఇచ్చామని, త్వరలోనే కల్యాణి డ్యామ్ పూర్తి చేసి మల్లన్న నీళ్లను వెంకన్న పాదాల చెంతకు తెస్తామని హామీ ఇచ్చారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి తమ కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించి నిలబెట్టిందని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చేందుకు యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ఈ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

కలియుగ దైవం సాక్షిగా .. లోకేష్ ఫైర్

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కలియుగ దైవం సాక్షిగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని అన్నారు. ఈ రెండేళ్లలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, దాడులు, హత్యలు, బెదిరింపుల రాజకీయాలకు తెరపడిందని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.

వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన లోకేష్, గతంలో టీడీపీని లేకుండా చేస్తామని చెప్పిన నాయకులకు ప్రజలే సమాధానం ఇచ్చారని అన్నారు. వైసీపీ రప్ప రప్ప అంటే చూస్తూ ఊరుకోబోమని, "రెడ్ బుక్" తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్‌పై కూడా విమర్శలు గుప్పిస్తూ, జగన్ పేరులోని "జీ"ని కొందరు జెన్‌జీగా భావిస్తున్నారని, కానీ అది గొడ్డలిని సూచిస్తుందని ఎద్దేవా చేశారు. జగన్‌కు "సీసీడీ" అంటే "క్రెడిట్ చోరీ డిజార్డర్" ఉందని విమర్శించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తే వాటిని కూడా తానే తీసుకొచ్చినట్లు చెప్పుకుంటారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+