'పెద్ది'లో ఆ సీన్ చేయాలంటే భయపడ్డా: జాన్వీ కపూర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని సీన్లపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ సీన్లను తొలగిస్తామని దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వివాదం నడుమ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. తాను షూటింగ్ సమయంలో ఎంతో భయపడిన ఓ సీన్ గురించి ఆమె వెల్లడించారు.

'పెద్ది' సినిమాలో తాను పోషించిన 'అచ్చియమ్మ' పాత్రకు సంబంధించిన ఎంట్రీ సీన్ గురించి జాన్వీ కపూర్ ప్రస్తావించారు. 'పెద్ది' సినిమాలో ఎంట్రీ సీన్ చేస్తున్నప్పుడు విపరీతంగా కంగారుపడ్డాననని వెల్లడించింది. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది పూర్తిగా భిన్నమైనదని.. ఈ సీన్‌ను పండించగలనా లేదా అని ఒకటే భయం వేసిందని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు స్క్రీన్ మీద ఆ సీన్ చూస్తుంటే చాలా కూల్‌గా , అద్భుతంగా అనిపిస్తోందని జాన్వీ చెప్పుకొచ్చారు. దర్శకుడి సృజనాత్మకతను తాను పూర్తిగా నమ్ముతానని.. 'ఉప్పెన' లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమా తీసిన బుచ్చిబాబు సనా లాంటి దర్శకుడితో పనిచేయడం గొప్ప అనుభవమని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.

Janhvi Kapoor on Peddi Movie Scared of Entry Scene Remembers Mother Sridevi Legacy Full Details

తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ.. ఈ చిత్రంలో మాస్ ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పే డైలాగుల కోసం జాన్వీ కపూర్ ఎంతో కష్టపడ్డారు. దీని గురించి జాన్వీ మాట్లాడుతూ.. "నేను ఓ సుదీర్ఘమైన మోనోలాగ్ చెప్పినప్పుడు, అక్కడున్న జనమంతా చప్పట్లతో హోరెత్తించారు. నేను తెలుగు డైలాగులను అంత పక్కాగా బట్టి పట్టి హావభావాలతో చెప్పడం చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో లభించిన ప్రశంసలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయి" అని జాన్వీ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు.

అదే ఇంటర్వ్యూలో తన తల్లి శ్రీదేవి లెగసీని గుర్తుచేసుకుంటూ జాన్వీ కపూర్ ఎమోషనల్ అయ్యారు. "అమ్మ 104 డిగ్రీల జ్వరంతో రెయిన్ సాంగ్ షూటింగ్‌లో పాల్గొందని, పాదాల నుంచి రక్తం కారేంతవరకు డాన్స్ చేసిందని వింటూ నేను పెరిగాను. అమ్మ పని పట్ల చూపించే ఆ నిబద్ధతను నేను ఎప్పుడూ గౌరవిస్తాను, అదే బాటలో నడవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు నా కెరీర్‌లో కూడా నా పిల్లలకు చెప్పుకునేలా కొన్ని గొప్ప కథలను, జ్ఞాపకాలను సేకరిస్తున్నాను" అని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+