• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవగ్రహ ప్రదక్షిణ పద్దతులు ఏంటి.. ఏ సమయాల్లో ప్రదక్షిణ చేయాలి..?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

What is the procedure to be followed for navagraha pradhakshina and what are its timings

గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు విగ్రహాలను తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి ( చంద్రుని వైపు నుంచి ) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు ( బుధుడి వైపు నుంచి ) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.

ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

'ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ: ' మంత్రాన్ని స్మరిస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. నవ గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి తొమ్మిది ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు ( అంటే మొత్తం 11 ) చేస్తే చాలా మంచిది అని పెద్దలంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.

1. రవి:-
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥

* మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం గలవాడా, సింహారాశికి అధిపతివైనవాడ ,కాశ్యపగోత్రుడా, నవగ్రహమండల నాయకుడా, శ్రీ సూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!

2. చంద్ర :-
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం ( క్షీరోదార్ణవ సంభవం ) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥

* రెండో ప్రదక్షిణలో కర్కాటకరాశికి అధిపతివైన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయ గోత్రోద్భవుడా, శ్రీ చంద్ర భగవానుడా, మమ్మల్ని కరుణించు!

3. కుజ :-
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥

* మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, మేష, వృశ్చిక రాసులకు అధిపతివైనవాడ, భరద్వాజ గోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.

4. బుధ :-
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥

* నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, మిథున, కన్యా రాసులకు అధిపతివైనవాడా, ఉత్తరదిశలో బాణ రూపమండలంలో వసించేవాడా, శ్రీ బుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

5. గురు :-
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥

* ఐదో ప్రదక్షిణలో అంగీరస గోత్రుడా, ధనుస్సు, మీన రాసులకు అధిపతివైనవాడ, దేవగురువైన బృహస్పతీ, శ్రీ గురు భగవానుడా మాపై కరుణను చూపుము.

6. శుక్ర :-
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥

* ఆరో ప్రదక్షిణలో భార్గవ గోత్రం గలవాడా, వృషభ, తులా రాశులకు అధిపతివైనవాడ, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీ భోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.

7. శని :-
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥

* ఏడో ప్రదక్షిణలో కాశ్యప గోత్రుడు, మకర, కుంభరాశులకు అధిపతివైనవాడ, దీర్ఘాయువును ప్రసాదించేవాడైన శ్రీ శనైశ్చరుడా మాకు మంగళాలు కలిగేలా చూడు.

8. రాహు :-
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥

* ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్ర మండలంలో వుండేవాడా, శ్రీ రాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు.

9. కేతు :-
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥

* తొమ్మిదో ప్రదక్షిణలో జైమిని గోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్ర స్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరున్నవాడా, శ్రీ కేతు భగవానుడా మాకు మేలు కలుగజేయి అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.

English summary
Navagrahas are very powerful. But they tend to worship them. The reason is not knowing when and how to do circumambulation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X