వాస్తు శాస్త్రం: దేవాలయ ఆవరణంలోని స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదా?
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
వాస్తు అంటే నివాసగృహం / ప్రదేశం అని శబ్దార్థం.శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు.వాస్తు శాస్త్రంలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉన్నాయి.
భూమి వాస్తు.
హర్మ్య వాస్తు
,శయనాసన వాస్తు.
యాన వాస్తు.
వాస్తు శాస్త్ర పురాణం
పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది.

ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి 'ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు.
ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.
శిరస్సున - శిఖి (ఈశ)
దక్షిణ నేత్రమున - సర్జన్య
వామనేత్రమున - దితి
దక్షిణ శోత్రమున - జయంతి
వామ శోత్రమున - జయంతి
ఉరస్సున (వక్షమున) - ఇంద్ర, అపవత్స, అప, సర్ప
దక్షిణ స్తనమున - అర్యమా
వామ స్తనమున - పృధ్వీధర
దక్షిణ భుజమున - ఆదిత్య
వామ భుజమున - సోమ
దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా
వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట
దక్షిణ పార్శ్వమున - వితధి, గృహక్షత
వామ పార్శ్వకామున - అసుర, శేష
ఉదరమున - వినస్వాన్, మిత్ర
దక్షిణ ఊరువున - యమ
వామ ఊరువున - వరుణ
గుహ్యమున - ఇంద్ర జయ
దక్షిణ జంఘమున - గంధర్వ
వామ జంఘమున - పుష్పదంత
దక్షిణ జానువున - భృంగరాజ
వామ జానువున - సుగ్రీవ
దక్షిణ స్పిచి - మృగబు
వామ స్పిచి - దౌవారిక
పాదములయందు - పితృగణము
ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడు'గా సృష్టి గావించాడు.
స్థల శుద్ధి లేనప్పుడు గృహ నిర్మాణం పనికిరాదు. స్థలం ఎన్నుకోవడంలో నేర్పు వుంటే గృహ నిర్మాణం తీరుగా వుంటుంది. స్థలానికి సమకోణంలో వీధి దూసుకుపోతే వీధి శూల వున్నట్లు అర్థం. అంటే వేరే వీధి వచ్చి గృహ గర్భంలో తగిలితే "గర్భశూల" అంటారు. వీధి స్థలంలోని ఇంటి నుండి దూసుకుని వెళితే "వీధిశూల" అని గుర్తించాలి.
తూర్పు వీధిశూల వల్ల రాజభయం. ఆగ్నేయం అయితే అగ్ని భయం, చోర భయం కూడా కలుగుతాయి. దక్షిణం అయితే రోగాలు, చావులు. పాము పుట్ట వున్న స్థలం కొని పుట్ట త్రవ్వి తీసివేసుకోవచ్చులే అని అనుకోకూడదు. అలా చేస్తే తర తరాలుగా నాగ భయం పీడిస్తుంది. నాగ దోషం కారణంగా సంతాన నష్టం, పిల్లల అకాల మరణం వంటివి సంభవిస్తాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
దేవాలయ ఆవరణంలోని స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. అలా చేస్తే తరతరాలు ఏ పని మొదలు పెట్టినా అపజయమే సిద్ధిస్తుంది. క్రమంగా వంశ నాశనం కూడా కలుగుతుంది. దేవతా విగ్రహాలు ఏ స్థలంలో దొరుకుతాయో ఆ స్థలాన్నికొని, గృహ నిర్మాణం చేయకూడదు. దేవతా శాపం వల్ల వివాహాలు కావు, మంత్రజపాలు బెడిసి కొడుతాయి.
మామిడిచెట్లు, పాలుగారే చెట్లు, కొబ్బరి చెట్లు నరికివేసి గృహాన్ని నిర్మించుకోవలసి వస్తే, ఆ స్థలాన్ని వాడుకోరాదు. అలాంటిచోట నివసించే స్త్రీలు నిండు యవ్వనంలోనే మరణిస్తారు. ఇంటి గర్భంలో ఆస్పత్రి, కబేళా, చర్మ పరిశ్రమలు దూసుకువచ్చేలా వున్న స్థలాన్ని నివాస గృహ నిర్మాణానికి ఎంపిక చేయకూడదు.
గోడలు అడ్డు పెడితే దోషం ఉండదా..?
కొన్ని వాస్తు దోషాలు సవరించడానికి గోడలు అడ్డుగా నిర్మించడం, వాస్తు దోషం గల భాగాన్ని వదలివేయడం అనేది చాలాకాలంగా వాడుకలో ఉంది.
ఈ పద్ధతి కొన్ని పరిస్థితులలో తప్పని సరి అయితే కొన్ని సందర్భాలలో ఈ విధానం పూర్తి స్థాయిలో పని చేయదు. ఈ విషయం గురించి గృహస్థులు అవగాహన కలిగి వుండటం చాలా మంచిది.
సాధారణంగా దోషపూరితమైన మూలలు, దిక్కులు పెరిగినప్పుడు పెరిగిన స్థలాన్ని వదిలేస్తూ అడ్డుగా గోడ నిర్మించడం జరుగుతుంది. తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలానికి ఆగ్నేయం పెంపును వేరు చేస్తూ గోడ నిర్మించాలి. అయితే తూర్పు వైపు రోడ్డు వుండి, తూర్పు ఆగ్నేయం పెంపు కలిసి వుంటూ ఆగ్నేయం పెంపును వేరు చేస్తూ గోడను నిర్మించినా కొంత ఆగ్నేయ దోషం పని చేయక మానదు. ఎందుకంటే తూర్పు ఆగ్నేయం పెంపును సరి చేయగలంగాని, తూర్పు ఆగ్నేయం పెంచుతూ కొనసాగిన రోడ్డు నడకను మార్చలేముకదా.
ఇదే పద్ధతిలో రోడ్డు వైపు ఏ దిక్కులో పోరిగిన మూలలను సరి చేసినా, కొంత దోషం తప్పదని గుర్తుంచుకోండి.
పెరిగిన మూలవైపు ఎటువంటి రోడ్డు లేకుండా ఇంటి లోపలి స్థలంలో పెరిగిన మూలలు సరి చేయడం వలన ఎటువంటి దోషం లేదు.
ఉదాహరణకు ఉత్తరంవైపు రోడ్డు ఉండి, దక్షిణ ఆగ్నేయం పెరిగిందనుకోండి.. ఇటువంటి సందర్భంలలో దక్షిణ ఆగ్నేయం పెంపును వేరు చేస్తూ ప్రహరీ నిర్మించడం వలన ఎటువంటి దోషం ఉండదు. కాని వదిలి వేసిన స్థలాన్ని కొందరు ప్రహరీ దాటి వాడటం జరుగుతూ వుంది. దాని వలన ఉపయోగం లేదు. వదలి వేసిన దోషయుక్తమైన స్థలాన్ని వాడటం వలన ప్రయోజనం వుండదు.
ఇంటి ప్రహరీ లోపల తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యం పెంపును సరిచేయడానికి తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్య స్థాలాలను వదిలివేసి ప్రహరీ నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా చేసేటప్పుడు గాని, లేదా చేసిన తరువాత కొంత కాలానికి గాని ఆర్థిక, ఆరోగ్య విషయాలలో నష్టపోవడం లేదా ఏదైనా ప్రతికూల సంఘటనలను ఎదుర్కొనడం జరుగుతుంది.
ఎందుకంటే, తూర్పు ఆగ్నేయం పెంపు సరి చేయునప్పుడు కొంత తూర్పు స్థలాన్ని, ఉత్తర వాయవ్యం సరి చేయునప్పుడు కొంత ఉత్తర స్థలాన్ని కోల్పోవడం జరుగుతుంది.
దీని వలన తాత్కాలిక సంఘటనలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వుంటుంది. అటు తరువాత ఈ మార్పు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.
రోడ్డువైపు పెరిగిన మూలలు సరి చేయునప్పుడు స్థలాన్ని సరి చేయగలమే గాని రోడ్డు నడకను మార్చలేం. కాబట్టి సరి చేసిన గోడను అనుసరించి చెట్లను పెంచడం వలన కొంత రోడ్డు నడక దోషం తగ్గుతుంది. ఇటువంటి సందర్భంలో గృహానికి దక్షిణ, పశ్చిమాల వైపు స్థలం ఎక్కువగా ఉంటే ఆ స్థలాన్ని వేరు చేస్తూ ప్రహారీ నిర్మించడం ఆచరణలో ఉంది. ఈ విధంగా వేరు చేసిన స్థలాన్ని పరాధీనం చేయడం మంచిది. అలా కాకుండా కేవలం ప్రహరీ నిర్మించి వేరు చేయడం వలన అనుకోని సంఘటనలతో తీరని నష్టాలు సంభవిస్తాయి.
దక్షిణ, పశ్చిమాల వైపు ఎక్కువగా స్థలం ఉంటే నైరుతిలో బలమైన కట్టడాన్ని నిర్మించడం మంచిది. ప్రహారీ నిర్మించి ఎక్కువైన దక్షిణపు స్థలాన్ని వేరు చేయడం వలన ప్రవేశం లేని స్థలంగా మారతాయి. ప్రవేశం లేని స్థలం శాస్త్ర విరుద్ధం. అలాగని ప్రవేశం ఏర్పాటు చేస్తే స్థలం వేరు చేయనట్టే లెక్క.
అడ్డు గోడలు నిర్మించే విషయం పరిశీలిస్తే తూర్పు, ఉత్తరాల వైపు అడ్డుగోడలు నిర్మించడం వలన పరవలేదనిపించినా, దక్షిణ, పశ్చిమం అడ్డుగోడల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని గుర్తుంచుకోండి. అడ్డు గోడ నిర్మించి వేరు చేసిన స్థలాన్ని పరాధీనం చేయడం, పూర్తిగా వాడకుండా వుండటం వంటివి చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.