అయోధ్య రామయ్య కోసం ప్రధాని మోడీ దీక్షలో భాగమైన యమ నియమాలు ఏమిటి?
భారత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం యమ నియమాలను పాటిస్తున్నారు. ప్రధాని మోడీ కటిక నేలపై నిద్రిస్తున్నారు. ఆహారాన్ని త్యాగం చేసి కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతున్నారు. చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు. మనసు రాముడిపైనే లగ్నం చేస్తున్నారు. అసలు ప్రధాని మోడీ ఆచరిస్తున్న యమ నియమాలు ఏమిటి? వాటిలో ఉండే ప్రధాన అంశాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు యమము , నియమము అనేవి పది ధర్మాలు. ఇవి సామాన్య ధర్మాలు. వీటిని అందరూ పాటించాలి. ప్రధాని మోడీ మాత్రమే కాదు భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన ధర్నాలు ఇవని చెబుతున్నారు.
వాటిలో మొదటిది అహింస .. ఇతరులకు హాని చేయకూడదు. మనకు బాధ కలిగే విషయాలు ఇతరులకు జరిగినా బాధ కలిగిస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

రెండవది సత్యం: ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి. అలాగే పరమాత్మ ఒక్కడే అన్న సత్యం తెలుసుకోవాలి.
మూడవది అస్త్రీయం: అస్త్రీయం అంటే పొరబాటున కూడా ఒకరి వస్తువును తీసుకోకూడదు. మనకు ఉన్న దానితోనే తృప్తి పడాలి.
నాలుగవది బ్రహ్మచర్యం: బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. పవిత్రమైన జీవితం గడపాలి. త్రికరణ శుద్ధిగా ఉండాలి.
ఐదవది అపరిగ్రహం: ఎంత అవసరమో అంతే సంపాదించాలి. ఇతరుల వద్ద నుండి చేసిన పనికి తీసుకునేది కూడా ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.
ఆరవది శౌచం: శారీరకంగా, మానసికంగా పరిశుభ్రత కలిగి ఉండాలి. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి.
ఏడవది సంతోషం: ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. లేని దాని కోసం ఆశ పడకూడదు. ఎవరి మీదా అసూయ, ద్వేషం ఉండకూడదు.
ఎనిమిదవది తపస్సు: తపస్సు అంటే క్రమ శిక్షణ, మన శరీరాన్ని మనసును కంట్రోల్ చేసి ఏకాగ్రతను పెంచేదే తపస్సు..
తొమ్మిదవది స్వాధ్యాయము : స్వాధ్యాయము అంటే శాస్త్రములు చదువుతూ ఉండాలి. అన్నీ కాకున్నా కనీసం కొన్నైనా చదవాలి .
పదవది ఈశ్వరప్రణిధానం: చేసే ప్రతీ పని భగవంతునికే సమర్పించుకోవాలి. తనను తాను పరమాత్మకు అర్పించుకోవాలి. భగవంతునికి శరణాగతుడు కావాలి. ఈ పది సామాన్య ధర్మాలే యమ నియమాలు. వీటినిప్రతీ ఒక్కరూ పాటించాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించారు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
Video: అద్భుతం! నుదుటిన సూర్య తిలకం, బాలరాముడికి భానుడి వందనం -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications