ఉత్తరం దిక్కు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు?
సాధారణంగా ఉత్తర దిక్కు తల పెట్టి నిద్రపోకూడదని చెబుతుంటారు. దానికి పౌరాణిక కథను కూడా చెబుతారు. దానికి పౌరాణిక కథ కూడా ఉంది. అయితే అసలు కారణం ఇదీ...
సాధారణంగా ఉత్తర దిక్కు తల పెట్టి నిద్రపోకూడదని చెబుతుంటారు. దానికి పౌరాణిక కథను కూడా చెబుతారు. శివుడు గణేశుడి తలను నరికిన తర్వాత మరో తలను తెచ్చి అతికించాల్సిన పరిస్థితిలో పడుతాడు. ఆ సమయంలో ఉత్తర దిక్కు తల పెట్టి పడుకున్న ప్రాణి తల తెచ్చి అతికించాలని చెబుతారు. అలా ఉత్తర దిక్కు తల పెట్టి నిద్రిస్తున్న ఏనుగు తలను నరుక్కుని వచ్చి గణేశుడికి శివుడు అతికిస్తాడని చెబుతుంటారు. అందుకే గణేశుడు వినాయకుడయ్యాడని అంటారు.
శివుడు గణేశుడి తలను ఎందుకు నరికాడనేది మరో కథ. తాను స్నానం చేస్తున్న సమయంలో గణేశుడిని తయారు చేసి పార్వతి ద్వారం వద్ద కాపలా పెడుతుంది. ఆ సమయంలో శివుడు వస్తాడు. అతన్ని గణేశుడు అడ్డుకుంటాడు. నన్నే అడ్డుకుంటావా అంటూ శివుడు అతని తలను నరికేస్తాడు. అయితే, ఉత్తర దిక్కు శిరస్సు పెట్టి పడుకోకూడదని చెప్పడానికి శాస్త్రీయమైన కారణం కూడా ఉంది.
మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడులో దాగివున్న శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి.
దానివలన అనేక ఆరోగ్య మానసికి సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెద డులో లోపాలు తల ఎత్తుతాయి.అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏనూనెతో వెలిగించాలి?
దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవునెయ్యితో
వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అప్టెశ్వరాలూ, అష్టభోగాలూ సిద్ధిస్తాయి. వెండి లేదా పంచ
లోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. అలాగే ఆముదంతో వెలిగించి చేసే దీపారాధన వలన
దాంపత్య సుఖమూ, జీవిత సౌఖ్యమూ కలుగుతాయి. వేరుశెనగ నూనెతో దీపారాధాన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి
ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.
లక్ష్మీదేవి తామరపువ్వలోనూ,ఇరుప్రక్కలా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది?
సరస్సులో తామర నిలకడగా ఉండదు, నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది.
తానూ నిలకడలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.
ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులకు అర్థం ఏమిటంటే శ్రీమహాలక్ష్మీ ధనబలము గజబలమంతటిదని
అర్థం చేసుకోమని పరమార్థం.












Click it and Unblock the Notifications