శని ప్రభావంతో 2027వరకు ఈ రాశులవారే మహర్జాతకులు!
గ్రహాలలో శనిదేవుడికి ఉండే స్థానం చాలా ప్రఖ్యాతమైన స్థానం. శని దేవుడు కర్మ దేవుడు మంచి చెడులను వర్గీకరించి మన కర్మ ఫలితాలను అందించే దేవుడు. క్రమశిక్షణకు మారుపేరుగా న్యాయదేవతకు ప్రతీకగా ఉండే దేవుడు శని దేవుడు. అటువంటి శని నిదానంగా ప్రయాణించే దేవుడు. శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది.
శని సంచారంతో అదృష్ట రాశులు
ప్రస్తుతం 30 సంవత్సరాల తర్వాత శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తోంది. ఇక 2025లో శని తన స్థానాన్ని మార్చుకుని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనరాశిలో శనిసంచారం కొన్ని రాశుల వారికి 2027 వ సంవత్సరం వరకు అదృష్టాన్ని ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీనరాశిలోకి శనిసంచారం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. పనిచేసే చోట పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్యారాశి
2025లో శని కన్య రాశి వారికి శుభ యోగాన్ని ఇవ్వబోతున్నాడు. కన్యారాశి జాతకులకు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పనిచేసే చోట పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. జీవితంలో ఈ సమయంలో కన్యా రాశి వారికి పురోగతి కనిపిస్తుంది. 2027 వరకు వీరికి అదృష్ట యోగం ఉంది.
మకర రాశి
మకర రాశి వారికి శని గ్రహం 2027 వరకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. మకర రాశి వారికి ఈ సమయంలో డబ్బుకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లికాని వారికి వివాహం జరుగుతుంది. పెళ్లయిన వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications