జ్యోతిషం: వివాహానికి గ్రహ దోషం ఉందా

1. బ్రహ్మానందం, సికింద్రాబాద్‌, వివాహం

రాహువులో, 8వఅధిపతి బుధుడి దశ నడుస్తుంది.గోచారంబాగాలేదు, వివాహానికి అనుకూలత ఇప్పుడులేదు. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేస్తూండండి.

2.అభిగ్న ఎలిసెట్టి, కెరియర్‌

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా? స్పష్టంగా రాయండి.

3. మహేశ్వరి.కె.యల్‌.వి, ఒరిస్సా, ఆర్థికస్థితి

లగ్నరాహువు, 7వ కేతువున్నాడు జాతకంలో, అష్టమాధిపతిదశ నడుస్తుంది. గోచారమూ బాగలేదుఈ గ్రహాలకి పరిహారం చేసుకోండి. 2017 లోమొదటి 2నెలు అనుకూలంగా ఉంటుంది. పైగ్రహాలకి శాంతిదానాలు చేయాలి.

4. రాంబాబు, విదేశం

మీకు విదేశాలకు వెళ్లడానికి పుట్టిన చోటు రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు .

5. నరసింహారావు.బి., ఢిల్లీ, వివాహం

వివాహం ఎప్పుడు జరుగుతుంది అని అడిగారు. అంతకుముందు మీ జాతకంలో వివాహానికి అడ్డుగా దోషం ఉంది, 7వఅధిపతి, 6వఅధిపతితోకలిసి, రాహువుతోకలిసి,3లో ఉన్నాడుమీకు గురు బలం లేదు. మరో ఏడాది తర్వాత వివాహం జరుగుతుంది.

6. డాక్టర్‌ బినాసింగ్‌, హైదరాబాద్‌

మీ ప్రశ్న తెలుగు ఫాంట్‌లో పంపండి. ప్రశ్న తెలుగుల, సంక్షిప్తంగా పంపండి.ఇంత పెద్దగా ఉంటే చదవడం కష్టం.

Ask Your astrologer: answered your questions

7. ప్రశాంతి, రవిల వివాహం -

మీకు కుజ దోషం ఉన్నది నిజమే కానీ మీ వివాహానికి ఆటంకం అదికాదు.

8.గంగాప్రసాద్‌,యం.వి, నిజామాబాద్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది కానీ మీ స్వంత దోషం వల్లపోయే అవకాశం ఉంది, సాధన ఎక్కువ చేయండి.

9. ఆనంద్‌ ప్రసాద్‌, కర్ణాటక, విడాకులు

మీరిద్దరివీ షష్టాకాలు, ఇద్దరి జాతకంలో వివాహభావంపైన పాప గ్రహాల ప్రభావం ఉంది, అసలు సమస్య ఎక్కడుందో చెప్పలేదు, దానాలు పరిహారాలు చేసుకునే ముందు,సమస్యేంటో కూర్చుని తేల్చుకోండి, అన్నీ పూజల ద్వారా తీరవు.

10. పవన్‌కుమార్‌ కుమ్మరి, ఖమ్మం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది.

11.వరప్రసాద్‌,విజయవాడ,ఆర్థిక స్థితి

జాతకంలో 8వశని, గోచారంలో 8వశని ఉన్నాడు 2సంవత్సరాలైతే కానీ అనుకూలత లేదు, మరొకమాట వృత్తిస్థానంలో కేతువు గురు, చంద్రులతో కలిసి ఉన్నాడు, వృత్తిలో అసంతృప్తి, మీపై ఇతరుల నరదృష్టి ప్రభావం ఉంటుంది, శని కేతువులకి దానాలు పరిహారాలు చేస్తూండండి.

12. సులోచన, విజయవాడ, ఉద్యోగం

ఏకాగ్రతాలోపం, తెలిసిచేసే తప్పులవల్ల ఉద్యోగాన్ని కొంతలో కోల్పోయే అవకాశాలు చాలాఎక్కువగా ఉన్నాయి. రవి, రాహు, కేతువులకి దానాలుచేస్తూండండి.

13.ఆంజనేయులు,కెరియర్‌

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి.

14 .గోపాల్ రెడ్డి, సిద్దిపేట, భవిష్యత్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచన ప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+