వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిష్కుడి జవాబు: ఐటిలో స్థిరపడవచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

1.రామారావు,వెంకటాపురం,సంతానం

సంతానంపరంగా మీ ఇద్దరికీ ఎలాంటి దోషమూ లేదు. కానీ అనుకూల గ్రహదశ ప్రస్తుతానికిలేదు, కాబట్టి మరొక సంవత్సరంలో మీకు సత్సంతానం కలుగుతుంది. సుబ్న్రభాఆ్యరాధన చేస్తూండండి. మీ భయాన్ని వదిలేయండి.

2.శ్రీనివాసరావు దామర్ల,ఈపురుపాలెం,ఉద్యోగం

మీకు జాతకరీత్యా ఏలినాటి శని నడుస్తుంది, దానికి పరిహారంచేసుకోండి, ఆగస్టుదాటితే కొంత బాగుపడుతుంది కానీ ప్రమోషన్‌కు అనుకూల సమయం దానధర్మాల పుణ్యం ఉండాలి. పుణ్యకార్యాలు చేయడం అవసరం. కొంత కాలము ఆగాల్సి ఉంటుంది.

3.ఓంకార్‌ పుట్టిన చోటురాయలేదు (హైదరాబాదుగా తీసుకుని పరిశీలించాం)ఉద్యోగం,వివాహం

మీకు ఉద్యోగం ఎప్పుడొస్తూందీ అనుకూల సమయం చెప్పవచ్చు, వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత బాగుంది, మీకు ప్రేమవివాహానికి అనుకూలత ఉంది.

Ask Your astrologer: solutions may arrive

4.సుబ్బు గోగినేని, ఒంగోలు, ఉద్యోగం

మీకు దశమంలో చంద్రుడున్నాడు, వృత్తిలో స్థిరత్వముండదు, మీ స్వంత పొరపాట్లు కూడా కొన్ని ఉంటాయి, వాటిని సవరించుకోండి. ఆగస్టులోపు ప్రయత్నించండి వస్తుంది.

5.బల్లాప్రగడ వరాహనర్సింహం,

మీ పిల్లల సమస్యేమిటో తెలుగులో రాసి పంపండి, వారివివరాలు పంపండి.

6. బాజిబాబు బెజ్జంకి,

పుట్టిన చోటు రాయలేదు, ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి ఏం తెల్సుకోవాలో రాయలేదు.

7.ఏ.మల్లికార్జున, రెడ్డి కొట్టల (కడప), కోర్టు కేసు

మీరు వివరాలు పూర్తిగా ఇవ్వలేదు, నక్షత్రం కూడా చెప్పలేదు, కానీ అన్నారు. తుల, వృశ్చిక, ధను అనే రాశులు మూడింటికి నడుస్తుంది ఏదనుకోవాలి? పేరు పైనుండి చూస్తే అసలు ఏల్నాటి శని లేనే లేదు.

8. ప్రవీణ్‌కుమార్‌,

వివరాలు రాయలేదు, ఉద్యోగం, మీరు ఎంచుకున్న రంగమేదొ మీరు కమ్యునికేషన్‌, ఐటి రంగాలలలో సెట్‌ అవుతారు.

9.కృష్ణ మూర్తి, శ్రీశైలం ,వ్యాపారం

వ్యాపారంలో వచ్చేసంవత్సరం అనుకూలత ఉంటుంది, గురు బలం లేనందున వ్యాపారంలో ఒడిదుడుకులుంటాయి.

10.ఒంటేరు శివప్రసాద్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

11. పిండి ప్రోలి భీమశంకర్‌,ఇంటి సమస్య

మీఇంటికి ఈశాన్య ముఖమున్నఇంట్లోకి వెళ్లినప్పటి నుండి బాగా లేదంటున్నారు, కానీ ఈశాన్య ముఖం మంచెదే, ఐతే ఆ ఇంట్లో ఎన్ని తలుపులు, కిటికీలు, ఇక్కడేది ఉంది అనేవి ప్రభావం చూపిస్తాయి. వాస్తు తెలిసిన వ్యక్తికి

12. శిల్పారెడ్డి, ఆదిలాబాద్‌, ప్రభుత్వోద్యోగం

ప్రభుత్వోద్యోగం రావడానికి గ్రహానుకూలత మీకు తక్కువగా ఉంది.

13. పాకలపాటి అభిలాష్‌రాజు,ముమ్మిడివరం,ఉద్యోగం

మీకు వివాహంతో ఉద్యోగం ముడిపడి ఉంది, వివాహానంతరం రావొచ్చు కానీ గ్రహానుకూలత కూడా తక్కువగా ఉంది, దానధర్మాలు చేస్తుండండి.

14.విశ్వనాధం, కె.పి విదేశగమనం

మీరీ సంవత్సరంలో విదేశాలకు వెళతారు.

15. రామ షెట్టి సునీత, హైదరాబాద్‌, కుజదోషం

మీకు కుజదోషం ఉంది, కానీ మాంగళ్య దోషంలేదు. మీకు తప్పక వివాహం అవుతుంది.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X