భవిష్యత్తు: ప్రేమ వివాహానికి అవకాశాలు, కానీ...

Posted By:
Subscribe to Oneindia Telugu

01. సి. ప్రియాంక, బెంగుళూరు, ప్రేమవివాహమేనా ?

మీకు ప్రేమ వివాహం అవుతుంది. ఐతే ఇప్పుడు రాహువు దశ నడుస్తోంది. దానికి పరిహారం చేసుకోండి. శుభం.

02. ప్రియాంక చౌదరి, వివాహం.

లగ్న రాహువు, 7వ కేతువు ఉన్నాడు. రాహువు దశ నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది. ఇవన్నీ వివాహానికి ఆటంకాలు కానీ ఒక ఆశ ఉంది గురుడు వచ్చే ఆగస్ట్‌ తర్వాత వివాహానికి గట్టిబలం అమదిస్తున్నాడు. వీటికి పరిహారాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన వివాహానికి జపం చేస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

03. చంద్రశేఖర్‌ మంచ, వరంగల్‌, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా ?

మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

04. సురేంద్ర తలుపూరు, నెల్లూరు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ?

మీకు జాతక రీత్యా ఉద్యోగానికిప్పుడు మంచికాలమే 2017 ఆగస్ట్‌ వరకు మీకు మంచికాలం నడుస్తుంది. ఏ అడ్డంకులు లేవు . ప్రయత్నం గట్టిగా చేయండి.

Astrologer cleared readers' doubts on issues

05. గోరంట్ల వెంకటేష్‌ చౌదరి, నరసారావు పేట, సాఫ్టవేర్‌ జాబ్‌ ఎప్పుడుస్తుంది ?

మీకు ఎప్పుడు వస్తుంది అనేదానికంటే ఉద్యోగానికి ఆటంకాలేమిటో తెలుసుకోండి. మొదటిది మీకు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది.రెండవ అంశమేమిటంటే, కేతువు నవమంలో ఉండటం. ఇవి ఆటంకాలు మూందు వీటికి శాంతి పరిహారాలు చేసుకుంటూ ఉండండి. తర్వాత మీకు ఆశించిన ఫలితం వస్తుంది. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. సాముఎల్‌ చీరాల, తెనాలి పుట్టిన సమయం రాయలేదు. (సాఫ్ట్‌వేర్ జాబ్‌ నాకు సరైనదేనా ?

మీరు పుట్టిన సమయం ఇవ్వకుండా వృశ్చికరాశి అని ఇచ్చారు. మీ ఇప్పటి పరిస్థితి ప్రకారం ఏలినాటి శని నడుస్తుంది. మీకు ఇది సరైన వృత్తేనా కాదా అని చెప్పాలంటే సమయం చూడాల్సిందే.

07. నీలం కుమార్‌, 30-08-1993, ఆరోగ్యం, గవర్నమెంట్‌జాబ్‌

మీకు జాబ్‌, ఆరోగ్యం వంటి అంశాలు సరిగ్గా చెప్పడానికి పుట్టిన సమయం, పుట్టి చోట్లు రాయలేదు. ఐతే ఆరోగ్యం ఎప్పటినుంచీ, ఏ రకమైన అనారోగ్యం చెప్ప లేదు . ఆయా రోగ గ్రహ సంబంధంగా దానాలు చేస్తూ ఉండండి. క్రీం అచ్యుతానామత గోవింద అనే మంత్రం జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

08. ఏ. మనోహర్‌. గుంటూర్‌, ప్రేమ వివాహం అవుతుందా ?

మీకు ప్రేమ వివాహం అవడానికి అవకాశం ఉంది.

09. సి బి హరిబాబు, కొడుమూరు, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా ?

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

10. బాలాజి కొలుకులూరి, వివాహం,

మీ జాతకరీత్యా వివాహానికి ఎలాంటి దోషమూ లేదు. కుజ దోషం ఉంది కానీ వివాహానికి అది అంత ఆటంకకరంకాదు ఏలినాటి శని తప్ప ఏ సమస్యా లేవు. గురుబలం రావడానికి ఆగస్ట్‌వరకూ ఆగాలి. శనికి పరిహారం చేసుకొండి. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

11. లక్ష్మీ నారాయణ, పుత్తూరు, గవర్నమడంట్‌ జాబ్‌ వస్తుందా ?

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలున్నాయి. కానీ గురు శనుల ప్రతికూలత ఎక్కువగా ఉంది. గోచారంలో 8వ అని నడుస్తున్నాడు కొంత వ్యతిరేకత ఉంది దానలు పరిహారాలు చేసుకుంటూ ఉండండి. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

12. స్పందన్‌ హనీ, నెల్లూరు, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు విదేశాలకి వెళ్లడానికి అవకాశాలున్నాయి.

13. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

సమయం ఇవ్వనివారు

పసునూరి, వరంగల్‌, 09/02/1994, సాఫ్టవేర్‌ జాబ్‌

యన్‌ బాబిరెడ్డి, కడప (పుట్టిన వివరాలివ్వలేదు.

14. హెడ్డింగ్ ‌పెట్టి వదిలినవారు

మదన్‌ మోహన్‌రెడ్డి, చెట్లువై 29/10/1986

దేవండ్ల కిరణ్‌ కుమార్‌ (జాతకం చెప్పమన్నారు ఏం చెప్పాలో అడగలేదు)

అనిల్‌కుమార్‌ తప్పెట, బిబిపేట, (జాతకం చెప్పమన్నారు ఏం చెప్పాలో అడగలేదు)

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

15. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్నలు

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

విశ్వనాథ వెంకట సుబ్రహ్మణ్యం, విజయవాడ

కోటేశ్వరరావు తోట, (దుబాయ్‌ నుంచి)

పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ astrology.telugu@oneindia.co.in

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి