• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Today Rasi Phalalu (15th October 2019) | రోజువారీ రాశి ఫలాలు

By Staff
|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

గమనిక:- ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి, ఈ విషయాన్ని గమనించగలరు. మీ పూర్తి జాతక వివరాల కోసం మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకోగలరని సూచన. జైశ్రీమన్నారాయణ.

మేషరాశి

మేషరాశి

ఈ రోజు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు,రాణింపు లభిస్తుంది.మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి

వృషభరాశి

ఈ రోజు దైవ సేవాకార్యాక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.పెద్దల ఆశీస్సులు,ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు.నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి

మిథునరాశి

ఈ రోజు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.మిత్రులను కలుసు కుంటారు.తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తలెత్తుతాయి.వృత్తి,వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.రహస్య విషయాలను తెలుసుకొంటారు.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి

కర్కాటకరాశి

ఈ రోజు స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం.గృహములో మార్పులు,చేర్పులు అనుకూలిస్తాయి.ప్రముఖులను కలుసుకుంటారు.పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి.వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి

సింహరాశి

ఈ రోజు స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు కొత్త యత్నాలు మొదలెడతారు. మీ అభిరుచి, ఆశయాలకు సంబంధించిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ చర్చలలో కొన్నిలోపాలు తలెత్తుట వలన మాటపడక తప్పక పోవచ్చు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్య రాశి

కన్య రాశి

ఈ రోజు పారిశ్రామిక రంగాల వారికి అధికారులు,చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు.ఖర్చులు,రాబడి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

తులరాశి

తులరాశి

ఈ రోజు ట్రాన్స్‌‌‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం.మీ కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.మీ చర్చలలో కొన్ని లోపాలు తలెత్తుట వలన మాటపడక తప్పకపోవచ్చు.స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల అవగాహన అవసరం.మీ ఆంతరంగిక,వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృశ్చికరాశి

వృశ్చికరాశి

ఈ రోజు ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు.ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తవుతాయి.ధనం బాగా అందుట వలన ఏ కొంతయినా నిల్వచేయ గలుగుతారు. మీ సంతానం ఉన్నతికి మంచి పథకాలు రూపొందిస్తారు.క్రయ విక్రయ రంగాలలో వారికి అనుకూలం.తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనస్సు రాశి

ధనస్సు రాశి

ఈ రోజు వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు.నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు,బిల్డర్లకు చికాకులు తప్పవు.స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.శ్రమకు తగిన ఫలితం పొందుతారు.ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టిసారిస్తారు.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మకరరాశి

మకరరాశి

ఈ రోజు ఉద్యోగస్తులకు స్థానమార్పిడి,కొత్త బాధ్యతల చేపట్టే అవకాశం ఉంది.మీ యత్నాలకు సన్నిహితులు అన్నివిధాలా సకారం అందిస్తారు.కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.బంధుమిత్రుల నుంచి ఒత్తిడి. మొహమ్మాటాలు ఎదుర్కుంటారు.చేపట్టిన పనులు నిర్విఘంగా పూర్తిచేస్తారు.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభరాశి

కుంభరాశి

ఈ రోజు వ్యవహారాలలో మెలకువలు అవసరం.సోదరుల మధ్య కలహాలు అధికం.సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. వస్త్ర, బంగారు, వెండి రంగాలలో వారికి కలిసిరాగలదు.స్థిరాస్థి విషయం గురించి ఆలోచిస్తారు.బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం,సందడి చోటు చేసుకుంటుంది.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

మీనరాశి

మీనరాశి

ఈ రోజు విద్యార్థులకు వసతి లభిస్తుంది.స్త్రీలకు పనివారితో చికాకులు అధిక మవుతాయి.స్పెక్యులేషన్ కలిసిరాదు.బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయి.ఖర్చులు, కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Daily horoscope for friday november 3– here’s what the stars have in store for you today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more