దీపాలను వెలిగించడంలో ఎన్ని నియమాలు ఉన్నాయో తెలుసా?: మీకోసం.. సమగ్ర సమాచారం
పురాణాల ప్రకారం కార్తీక మాసానికి ఉన్న ప్రాముఖ్యత, పవిత్రత భిన్నంగా ఉంటుంది. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమినాడు భక్తులు శివకేశవులను ఆరాధిస్తుంటారు. ఈ నెలలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. లక్ష్మీదేవి దీప స్వరూపంగా భావిస్తారు. కార్తీకమాసంలో దీపానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఈ సందర్భంగా పవిత్రమైన కార్తీక మాసంలో దీపాలను వెలిగించడానికి వేసే వత్తులు, అందులో పోసే నూనెకూ ప్రాముఖ్యత ఉంది.

ఎన్ని వత్తులు వెలిగించాలి..?
ఒక వత్తిని వాడకూడదంటుంటారు పెద్దలు. అంటే ఏక వత్తితో దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే శుభాలు సామాన్యంగా ఉంటాయని అంటుంటారు. రెండు వత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబ సౌఖ్యం, మూడు వత్తులను వాడటం వల్ల పుత్ర సౌఖ్యం, అయిదు వత్తులతో దీపారాధన చేయడం వల్ల ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం, అభివృద్ధి సమకూరుతుందని ఆధ్యాత్మిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి అత్యంత శ్రేష్ఠమైనది.

ఎలాంటి నూనెను వినియోగించాలి..?
నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం ద్వారా సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపాలను వెలిగిస్తే.. జీవితం దేదీప్యమానమౌతుందని పెద్దలు స్పష్టం చేస్తోన్నారు. తన కుటుంబం మాత్రమే కాకుండా బంధుమిత్రులకు దాని ఫలం దక్కుతుందని అంటున్నారు. వేరుశెనగనూనెతో దీపారాధనను పొరపాటున కూడా చేయకూడదనేది వారి అభిప్రాయం.

ఎన్ని రకాల నూనెలతో దీపాన్ని వెలిగించవచ్చు..?
వేరుశెనగ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల రుణబాధలు అధికం అవుతాయి. చోర భయం ఉంటుంది. మానసిక ఆందోళన వెంటాడుతుంది. నెయ్యి, ఆముదం, వేప నూనె, కొబ్బరి నూనె, ఇలపనూనె మిశ్రమంతో 48 రోజుల పాటు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తల అభిప్రాయం. వేపనూనె, నెయ్యి, ఇలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం సిద్ధిస్తుందని, ఇలవేల్పులు ప్రసన్నమౌతారు.

ఏ దిక్కున దీపాన్ని ఉంచాలి..?
ప్రతిరోజు దీపారాధన తెల్లవారు జామున 3 గంటల నుంచి 6 గంటలలోపు చేయడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. దీపాన్ని తూర్పు దిక్కున ఉంచి వెలిగించితే కష్టాలు తొలగిపోతాయి. గ్రహ దోషాలు సమసిపోతాయి. పశ్చిమ దిక్కున ఉంచడం వల్ల రుణ బాధలను విముక్తి లభిస్తుంది. గ్రహదోషాలు, శనిదోషాలను నివారించినట్టవుతుంది. దక్షిణం దిక్కున దీపాన్ని వెలిగించకూడదు. అలా చేయడం వల్ల కష్టాలు సంభవిస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఉత్తరం దిక్కున దీపం వెలిగించడం వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది.

బ్రహ్మముహూర్త సమయంలో దీపాన్ని వెలిగించడానికి తొలి ప్రాధాన్యత..
సంవత్సరంలో ఏ రోజైనా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని పెద్దలు చెబుతుంటారు. అలా వీలు కానప్పుడు కనీసం కార్తీకమాసంలోనైనా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని, ఆ సమయం ముగిసేలోగా స్నానాదులు ముగించుకుని.. దీపాలను వెలిగించాలని అంటుంటారు. శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా ఎలాంటి దోషాలు లేని సమయంగా దీన్ని భావిస్తారు. అలాంటి సమయంలో, దేవుడి ముందు దీపాలను వెలిగించి దినచర్యలను ప్రారంభించడం మంచిదనేది ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం.

బ్రహ్మముహూర్తంలో వీలు కాకపోతే..
సూర్యోదయానికి ముందు దీపాన్ని వెలిగించే అవకాశం లభించకపోతే.. ఉదయం 8 గంటల్లోగా దీపాన్ని వెలిగించే ప్రత్యామ్నాయ సమయం ఉంది. ఆ తరువాతి సమయం మంచిది కాదని ఆధ్యాత్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత దీపారాధన చేయాలి. నియమాలను అనుసరించడం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications