వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జన్మభూమిలోనిరసనల వెల్లువ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః 15వ విజత మహిళా జన్మభూమి తెలుగునేల నలు చెరగులా ఘనంగా ప్రారంభమైనప్పటికీ పలు చోట్ల ప్రతిపక్షాలు జన్మభూమిని అడ్డుకొనే ప్రయత్నాలు చేయడంతో రసాభాసగా మారింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌,విజయవాడ, రాజమండ్రి, నంద్యాలలో జన్మభూమి సభలను వామపక్ష కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రజలు అధికారులు, మంత్రులను తమ సమస్యలపై నిలదీశారు.

హైదరాబాద్‌ లో .....
హైదరాబాద్‌ లో జరిగిన మహిళా జన్మభూమి కార్యక్రమంలో మంత్రులువిజయరామారావు, కృష్ణయాదవ్‌ పాల్గొన్నారు. వీరు పాల్గొన్న కార్యక్రమాలలో ప్రజలు పలు ఫిర్యాదులు చేశారు. తమ సమస్యలను అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ధ్వజమెత్తారు. ప్రజలు రెచ్చిపోవడంతో అధికారులు, మంత్రలు ఇరకాటంలో పడ్డారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ రంగారెడ్డి జిల్లాలో పాల్గొన్న జన్మభూమి కార్యక్రమంలో కూడా అధికారులు ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది.

విజయవాడలో .......
మహిళా జన్మభూమి కార్యక్రమంలో భాగంగావిజయవాడలో శుక్రవారం వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. నగర మేయర్‌ అనూరాధ ఈ కార్యక్రమానికి సారధ్యం వరించారు. చాలా ఏళ్ళుగా తాము వృద్ధాప్య పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ ఇప్పుడు వేరేవారికి వృద్ధాప్యపు పెన్షన్లు ఇస్తున్నారంటూ సిపిఎం కార్యకర్తలు ధ్వజమెత్తారు. జన్మభూమిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. దీనితో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు మేయర్‌ సర్ది చెప్పడంతో వామపక్ష కార్యకర్తలు శాంతించారు.

రాజమండ్రిలో......
రాజమండ్రిలో జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్ల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్న కార్యక్రమంలో ప్రతిపక్ష కార్యకర్తలు రభస సృష్టించారు. జన్మభూమి లబ్దిదారుల ఎంపికలో ఆశ్రిత పక్షపాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదంటూ పతిపక్ష కార్యకర్తలు గొడవకు దిగారు. దీనితో జన్మభూమి కార్యక్రమాలు కొద్దిసేపు నిలిచిపోయాయి.

నంద్యాలలో........
నంద్యాలలో మంత్రులు ఫరూఖ్‌, బి.వి. మోహన్‌ రెడ్డి పాల్గొన్న
కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు సిపిఎం కార్యకర్తలు ప్రయత్నించారు. జన్మభూమి కార్యక్రమం తెలుగుదేశం వారి కార్యక్రమంగా మారిపొయిందని, సామాన్యులకు ఎవరికీ ప్రయోజనం చేకూరడం లేదని వారు ఆరోపించారు. నిర్మల, ప్రభాకర్‌ సారధ్యంలోని సిపిఎం కార్యకర్తలు వందల సంఖ్యలో జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మంత్రులు సర్ది చెప్పినా వారు దారికి రాకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, కొందరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్‌ జిల్లాలో కూడా జన్మభూమి కార్యక్రమంలో కొంద రభస జరిగింది. మంత్రి కడియం శ్రీహరి పాల్గొన్న జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు వామపక్ష కార్యకర్తలువిఫలయత్నం చేశారు.

తల్లీబిడ్డలకు వరం జననిః బాబు
మహిళాజన్మభూమికి శ్రీకారం
ఆడపిల్లలవిక్రయాల ఆటకట్టుః బాబు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X