ట్రంప్ తగ్గేదే లేదు: మీడియాలో పాజిటివ్ కవరేజ్ లేదని ఏకంగా టీవీనే లాంచ్ చేశాడు

అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ లో నిర్వహించే ప్రెస్ కాన్ఫరెన్స్, ఇతర అధికారిక కార్యక్రమాలను కవర్ చేసే విషయంలో కొన్ని మీడియా సంస్థలపై నిషేధం విధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి టాప్ మీడియా గ్రూప్ లకు వైట్ హౌస్ ప్రవేశ అనుమతులను రద్దు చేసిన తరుణంలో తాజా వ్యూహాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఈ మూడ సంస్థలు కూడా కోర్టుకెక్కాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, సంజాయిషీ చెప్పుకొనే అవకాశం కల్పించకుండా ఏకపక్షంగా ఎంట్రీ పాస్ లను జప్తు చేశారని కోర్టులో పిటిషన్‌ వేశాయి.

ఈ పరిణామాల మధ్య వైట్ హౌస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ట్రంప్ పేరుతో ఓ టీవీ నెట్ వర్క్ నే లాంచ్ చేసింది. 'ట్రంప్ టీవీ: ది ఎస్సెన్షియల్స్ స్టేషన్..' పేరిట నూతనంగా 24/7 డిజిటల్ వీడియో బ్రాడ్ కాస్టింగ్ ను ప్రారంభించింది. డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ.. దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. రౌండ్ ద క్లాక్.. వార్త ప్రసారాలు కొనసాగుతాయి ఇందులో. ఓ రెగ్యులర్ టీవీ ఛానల్ తరహాలో దేశ, విదేశాల్లో జరిగే విశేషాలు, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు సంబంధించిన అప్ డేట్స్, ప్రెస్ కాన్ఫరెన్సులు.. అన్నీకూడా ఇందులో బ్రాడ్ కాస్ట్ అవుతాయి.

White House Launches TRUMP TV to Stream 24 7 Network Administration content Begins Digital Broadcasting

ఆయా మీడియా సంస్థల ప్రతినిధులక వైట్ హౌస్ లో ఎంట్రీని నిషేధించడానికి నిరసనగా మీడియా సంస్థలు తనను బహిష్కరించడానికి సిద్ధమవుతున్నాయనే ప్రచారంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఇటువంటి ప్రచారాలను చూసి తాను ఆందోళన చెందట్లేదని, వీటిని పెద్దగా పట్టించుకోననీ అన్నారు. సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందనే నైతికత మీడియాపై కూడా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు.

తిరుమలలో అరుదైన ఘట్టం: తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేర్లతో.. !!
తిరుమలలో అరుదైన ఘట్టం: తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేర్లతో.. !!

తన పాలనా కాలంలో సాధించిన ఘనతలను మీడియా తక్కువ చేసి చూపిస్తోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాము భారీ మెజారిటీతో చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ఆర్థిక ప్రగతిని సాధించామని, దేశ ఆర్థిక వ్యవస్థలోకి సుమారు 21 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయి భారీ పెట్టుబడులు తరలివచ్చాయని పేర్కొన్నారు. అమెరికా స్వర్ణయుగం ఇక్కడి నుంచే ఆరంభమైందని ప్రకటించారు.

తాము దేశ ప్రయోజనాల కోసం అద్భుతంగా పని చేస్తోంటే.. మీడియా మాత్రం ఎప్పుడూ ప్రతికూల వార్తలనే ప్రసారం చేస్తోందని, సానుకూల అంశాలను చూపించట్లేదని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది యుద్ధాలను తాము శాంతియుతంగా పరిష్కరించామని పునరుద్ఘాటించారు. ఇరాన్ వ్యవహారాల గురించి ప్రస్తావించారు. ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేసుకోకుండా సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మీడియా ఎంట్రీని నిషేధించడంపై జోహ్రాన్ మమ్దానీ స్పందించారు. ప్రతికా స్వేచ్ఛకు తాను మద్దతు ఇస్తానని, కొన్ని మీడియా సంస్థలకు వైట్ హౌస్ లో ఎంట్రీని నిషేధించడం సరికాదని తేల్చి చెప్పారు. ట్రంప్ తో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించానని వివరించారు.

మీడియాకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలన్నదే తన అభిప్రాయమని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు. వైట్‌హౌస్ లో అన్ని మీడియా సంస్థలకు ప్రవేశం కల్పించేలా చూస్తామని అన్నారు. ప్రభుత్వ విధానాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా, ఎవరు ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసినా వాటన్నింటినీ స్వీకరించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+