మహిళా జన్మభూమికిశ్రీకారం
హైదరాబాద్‌ః 15వ విడత జన్మభూమి కార్యక్రమం శుక్రవారం తెలుగునేల లోని పల్లె పల్లెనా ప్రారంభమైంది. ఈ జన్మభూమిని మహిళా జన్మభూమిగా ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదిలాబాద్ జిల్లాలో జనని పథకానికిశ్రీకారం చుట్టడం ద్వారా 15వ విడత జన్మభూమిని ప్రారంభించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలలోపెద్ద ఎత్తున ఈ జన్మభూమి కార్యక్రమం జరిగినట్లు సమాచారంఅందింది.
మహిళా జన్మభూమి సందర్భంగా వివిధ పథకాల కింద ప్రభుత్వం సుమారు 300 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.వీటిలో ముఖ్యంగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, మహిళలకు, ఉపాథి శిక్షణా కార్యక్రమాలు, వంటగ్యాస్ కనెక్షన్ల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నది.
వచ్చే పంచాయతీ ఎన్నికల్లో మహిళల ఓట్లు రాబట్టుకొనేందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మహిళా జన్మభూమి నాటకం ఆడుతున్నదని ప్రతిపక్షాలువిమర్శించాయి. ఆడశిశువులను సంతలో సరుకుఅమ్మినట్లు అమ్ముతున్నా నమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాతశిశు సంక్షేమంఅంటూ ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా వున్నదంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
తల్లీబిడ్డలకు వరం జననిః బాబు
ఆడపిల్లలవిక్రయాల ఆటకట్టుః బాబు
జన్మభూమిలో నిరసనలవెల్లువ












Click it and Unblock the Notifications
