వాజ్‌ పేయితో మమత భేటీ

న్యూఢిల్లీః తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామిగా వున్న మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లోఘోరంగా పరాజయం పాలైన అనంతరం మమత ప్రధానిని కలుసుకోవడం ఇదే ప్రథమం. మమత తిరిగి ఎన్డీఏ ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే మమతను తిరిగి ఎన్డీఏలో చేర్చుకొనే ప్రసక్తి లేదని ఇటీవలే వాజ్‌పేయి తేల్చి చెప్పారు.

తాను ఎన్డీఏలో చేరబోవడం లేదని కూడా మమత శుక్రవారం ప్రధానిని కలిసిన అనంతరంవిలేకరులకు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సందర్భంగా వామపక్షాలు హింసకు పాల్పడ్డాయిని, ఎన్నికల సంఘం కూడా పక్షపాతంతో వ్యవహరించాయని మమత ప్రధానికి ఫిర్యాదు చేశారు. కేవలం ఫిర్యాదు చేసేందుకే మమత ప్రధానిని కలిశారా లేక మరేమైనా కారణాలున్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+